పైనాపిల్ తొక్క‌ల‌ను పారేస్తున్నారా? అయితే ఈ విష‌యాలు మీరు తెలుసుకోవాల్సిందే!

పైనాపిల్.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

పులుపు, తీపి రుచుల‌ను క‌లిగి ఉండే పైనాపిల్‌లో కాల్షియం, పాస్పరస్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, ప్రోటీన్, ఫైబ‌ర్‌తో స‌హా శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే పైనాపిల్ విష‌యంలో దాదాపు అంద‌రూ ఓ పొర‌పాటు చేస్తుంటారు.అదే తొక్క‌ల‌ను పారేయ‌డం.

పైనాపిల్ తొక్క‌లు ఎందుకు ప‌నికిరావ‌ని భావించి.వాటిని డ‌స్ట్ బిన్‌లోకి తీసేస్తుంటారు.

Advertisement

కానీ, పైనాపిల్ తొక్క‌ల‌తోనూ ఎన్నో లాభాల‌ను పొందొచ్చు.ముఖ్యంగా పైనాపిల్ తొక్క‌ల‌తో టీ త‌యారు చేసుకుని తీసుకుంటే మ‌స్తు హెల్త్ బినిఫిట్స్ ల‌భిస్తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పైనాపిల్ తొక్క‌లతో టీ ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు పైనాపిల్ పీల్ టీ తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పైనాపిల్‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి.తొక్క‌ను చెక్కుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో పైనాపిల్ తొక్క‌లు, చిన్న దంచిన అల్లం ముక్క‌, అర అంగుళం ప‌చ్చి ప‌సుపు కొమ్ము, చిటికెడు మిరియాల పొడి వేసి ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆపై స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

రుచికి స‌రిప‌డా తేనెను యాడ్ చేస్తే పైనాపిల్ పీల్ టీ సిద్ద‌మైన‌ట్లే.వారంలో రెండు, మూడు సార్లు పైనాపిల్ పీల్ టీను తీసుకుంటే శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి.

Advertisement

అలాగే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో త‌ర‌చూ స‌త‌మ‌తం అయ్యే వారికి ఈ టీ ఓ ఔష‌దంలా ప‌ని చేస్తుంది.పైనాపిల్ పీల్ టీని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, పైనాపిల్ పీల్ టీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.మూత్ర‌పిండాలు శుభ్రం అవుతాయి.

గొంతు నొప్పి, వాపు, జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

తాజా వార్తలు