ఇమ్యూనిటీ పెంచే తిప్ప‌తీగ‌.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!  

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది.ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.

TeluguStop.com -  Wonderful Health Benefits Of Giloy

ఇక ఈ క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ప్ర‌జ‌లు ఎప్పుడూ లేని విధంగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌రుచుకోవ‌డానికి నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డంలో తిప్ప తీగ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌న‌ ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కలా ఈ తిప్ప తీగ క‌నిపిస్తూనే ఉంటుంది.

TeluguStop.com - ఇమ్యూనిటీ పెంచే తిప్ప‌తీగ‌.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ, చాలా మందికి ఈ తిప్పతీగ‌లో ఉండే ఓష‌ధ ‌గుణాలు తెలియ‌క తెలిగ్గా తీసుకుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలిస్తే.ఆ తిప్ప‌తీగ మొక్క‌ల‌ను వెతికి మ‌రీ మీ ఇంట్లో పెంచుకుంటూరు.

తిప్ప‌తీగ‌ను పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తాయి.ఆరోగ్య ప‌రంగా తిప్పతీగ చేసే మేలు అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలి అని అనుకునే వారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అవును, తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డంతో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వాటిని నాశ‌నం చేస్తాయి.అలాగే దగ్గు, జలుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న వారికి తిప్ప‌తీగ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో తిప్పతీగ చూర్ణం మ‌రియు అల్లం ర‌సం క‌లిపి తీసుకుంటే.దగ్గు, జలుబు, జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గ‌డంతో పాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

గ్యాస్‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు మందులు ఎక్కువ‌గా వాడుతుంటారు.కానీ, ఇక‌పై తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే మ‌ధుమేహం స‌మ‌స్య ఉన్న వారు ప్ర‌తి రోజు తిప్ప‌తీగ చూర్ణం తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి.

#Giloy #Health #Tippa Teega #Good Health #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు