రోజుకో స్పూన్ ఆవు నెయ్యి తీసుకుంటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ నెయ్యిని అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే నెయ్యిని కొంద‌రు డైరెక్ట్‌గా కూడా తీసుకుంటుంటారు.

అయితే నెయ్యిలో రెండు ర‌కాలు.అందులో ఒక‌టి ఆవు నెయ్యి కాగా.

మ‌రొక‌టి గేదె నెయ్యి.ఈ రెండిటిలో ఆవు నెయ్యిలోనే అత్య‌ధిక పోష‌కాలు నిండి ఉంటాయి.

అవును, రోజుకో స్పూన్ చ‌ప్పున ప్ర‌తి రోజు ఆవు నెయ్యి తీసుకుంటే బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.

Advertisement

ఆవు నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు మెద‌డు ప‌ని తీరును మెరుగు ప‌రుస్తాయి.

ఆలోచ‌నా శ‌క్తి కూడా పెరుగుతుంది.అలాగే రెగ్యుల‌ర్‌గా ఆవు నెయ్యిని తీసుకుంటే.

ర‌క్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫ‌లితంగా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఆవు నెయ్యిలో విట‌మిన్ కె పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల ఆవు నెయ్యి ప్ర‌తి రోజు ఒక స్పూన్ చ‌ప్పున తీసుకుంటే.ఎముక‌లు, దాంతాలు దృఢంగా మార‌తాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి.అలాగే కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు ఆవు నెయ్యిని తీసుకుంటే చాలా మేలు.

Advertisement

ఎందుకంటే, విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఆవు నెయ్యి కంటి చూపు మెరుగు ప‌ర‌చ‌డంతో పాటు కంటి సంబంధిత జ‌బ్బుల‌ను నివారిస్తుంది.ఆవు నెయ్యిను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, పేగుల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయప‌డుతుంది.

మ‌గ‌వారు ఆవు నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.ఇక ఆవు నెయ్యి తీసుకుంటే.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.ఫ‌లితంగా సీజ‌న‌ల్‌గా వ‌చ్చే జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు