వెల్లుల్లి అంటే దాదాపు అందరికీ గుర్తుకు వచ్చేది తెల్ల వెల్లుల్లినే.అయితే మరో రకం కూడా ఉంది.అదే నల్ల వెల్లుల్లి.కానీ, చాలా మందికి నల్ల వెల్లుల్లి ఉంటుందనే విషయమే తెలియదు.నిజానికి తెల్ల వెల్లుల్లితో పోల్చితే నల్ల వెల్లుల్లిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటుయి.మరియు లెక్క లేనన్ని ప్రయోజనాలను అందించడంలో నల్ల వెల్లుల్లి మహా దిట్ట.
మరి ఇంకెందుకు లేటు.అసలు నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.
ఉబ్బసం రోగులకు నల్ల వెల్లుల్లి మంచి ఔషధంగా పని చేస్తుంది.ఇక గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు నల్ల వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఉబ్బసం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

నల్ల వెల్లుల్లిని పరగడుపున డైరెక్ట్‌గానీ, తేనెతోగానీ తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.అలాగే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

క్యాన్సర్‌కు అడ్డు కట్ట వేయడంలోనూ నల్ల వెల్లుల్లి ఎఫెక్టివ్‌గా ఉపయోగపడుతుంది.ప్రతి రోజూ ఖాళీ కడుపున పొట్టు తీసిన రెండు నల్ల వెల్లుల్లి రెబ్బలను తింటే.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
ముఖ్యంగా పెద్ద ప్రేగు కాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది.
అంతేకాదు, తెల్ల వెల్లుల్లికి బదులుగా నల్ల వెల్లుల్లిని వాడితే.
లివర్ సంబంధిత సమస్యలేవి దరి దాపుల్లోరి రాకుండా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.అల్జీమర్స్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
హెయిర్ ఫాల్ నుంచి ఉపశమనం లభిస్తుంది.మరియు చర్మంపై మొటిమలు రావడం కూడా తగ్గుతుంది.