పాలు.ఆరోగ్యానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించే పాలను రోజుకో గ్లాసు అయినా తీసుకోవాలని అంటారు ఆరోగ్య నిపుణులు.కానీ, కొందరికి మాత్రం పాలు పడవు.
అలాంటి వారు పాలు మాత్రమే కాదు పాలతో తయారు చేసిన ఏ పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడరు.అయితే అలాంటి వారు ప్రత్యామ్నాయంగా బాదం పాలు తీసుకోవచ్చు.
బాదం పాలతో కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
బాదం పప్పు నుండి తయారు చేసే బాదం పాలు తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య దూరం అవుతుంది.నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది రక్త హీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.
అలాంటి వారు బాదం పాలు తాగడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది.అలాగే బరువు తగ్గాలనుకునే వారు బాదం పాలను ఎంచుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకంటే.బాదం పాలలో చాలా తక్కవ శాతం కేలరీలు ఉంటాయి.
మరియు బాదం పాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది.తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అలాగే సోడియం తక్కువగా, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే బాదం పాలను ప్రతి రోజు తీసుకోవడం గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షణ లభిస్తుంది.అదే సమయంలో అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది.విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదం పాలు తీసుకుంటే.చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.బాదం పాల వల్ల మరో అదిరిపోయే ప్రయోజనం ఏంటంటే.మతి మరుపు తగ్గడంతో పాటు బ్రెయిన్ చురుగ్గా పని చేస్తుంది.
ఇక బాదం పాల వల్ల లభించే క్యాల్షియం ఎముకలను, దంతాలను మరియు కండరాలను దృఢంగా, బలంగా మారుస్తుంది.