సుఖ నిద్ర కోసం అద్భుతమైన పూలు..!

చాలా మంది రోజంతా కష్టపడుతూనే ఉంటారు.వారు అలా కష్టపడటం వల్ల వారి శరీరం అలసిపోతుంది.మనసుకు కొంత బాధగా కూడా ఉంటుంది.ఇంకొందరికి నిద్ర పట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.మరి ఇటువంటి వారి కోసం మల్లెపూలు ఎంతగానో ఉపయోగపడుతాయి.మల్లెపూలలో ఉండే ఆ సువాసన మనసును కొంత ఆహ్లాదకరంగా చేస్తుంది.

 Wonderful Flowers For A Good Night's Sleep . Jasmine,sleep, Hair Oils,good Sleep-TeluguStop.com

శరీరానికి కొంత ఓదార్పును ఇస్తుంది.మధురానుభూతులను పంచుతుంది.

ఆనందమయం చేస్తుంది.నిజమే మల్లెపూలు రాత్రి గదిలో పెట్టుకుంటే నిద్ర హాయిగా పడుతుంది.

ఈ మల్లెపూల వల్ల అనేక రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి.మల్లెపూల వల్ల కళ్లకు ఎంతో మంచి జరుగుతుంది.

అలసిపోయిన కనురెప్పలకు ఈ మల్లెపూలు మేలు చేస్తాయి.అలసిన కను రెప్పలపైన కొద్దిసేపు మల్లెపూలను ఉంచితే చలవ చేస్తుంది.దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది.సాధారణంగా ఈ మల్లెపూలను సబ్బులు, తలనూనెలను చేయడానికి బాగా ఉపయోగిస్తారు.అంతేకాదు సౌందర్య సాధనాలలో ఈ మల్లెపూలను బాగా వాడతారు.

ఇంకా అగరబత్తీల తయారీకి మల్లెపూలను బాగా ఉపయోగిస్తారు.

సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌ లలో మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు.తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారైన పూతను తలకు పట్టిస్తే మంచిది.

కళ్లమంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని వాడవచ్చు.పూలు, ఆకులతో కషాయం కాచాలి.

ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒక వంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి.

Telugu Sleep, Oils, Benifits, Care, Tips, Jasmine-Latest News - Telugu

ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది.ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నా లేకుంటే డిప్రెషన్ లోకి వెళ్లినా, ఇంకా అతి కోపంతో ఉన్నా వారు మల్లెపూలను వాడటం ఎంతో మంచిది.గుప్పెడు మల్లెపూలను తలకింద పెట్టుకుని నిద్రపోతే మంచి నిద్ర పడుతుంది.

మనసు ప్రశాంతంగా ఉంటుంది.రోజుకు పదిసార్లు మల్లెపూల వాసనను పీల్చితే మంచి నిద్ర పడుతుంది.

అలాగే మనసు కూడా స్థిమితంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube