రెడ్ వైన్.దీన్ని లిమిట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే చర్మానికి కూడా రెడ్ వైన్ చేసే మేలు అంతా ఇంతా కాదు.ముఖ్యంగా రెడ్ వైన్‌తో ఫేషియల్ చేసుకుంటే మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మరి ఆలస్యమెందుకు ఇంట్లోనే రెడ్ వైన్‌తో ఫేషియల్ ఎలా చేసుకోవాలి.? అసలు రెడ్ వైన్‌తో ఫేషియల్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
స్టెప్-1: ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్లు నాణ్యమైన రెడ్ వైన్, ఒక స్పూన్ నిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమానికి దూది సాయంతో అప్లై చేసి క్లిన్సింగ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
స్టెప్-2: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్, అర స్పూన్ షుగర్ పౌడర్, రెండు లేదా మూడు స్పూన్లు రెడ్ వైన్ వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి స్మూత్‌గా రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం వాటర్‌తో శుభ్రపరుచుకోవాలి.
స్టెప్-3: ఒక బౌల్లో రెండు స్పూన్ల రెడ్ వైన్, ఒక స్పూన్ ఆలోవెర జెల్, రెండు చుక్కలు లావెండర్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించి.పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
స్టెప్-4: ఒక బౌల్లో ఒక స్పూన్ ముల్తానీ మట్టి, అర స్పూన్ పెరుగు, అర స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ రెడ్ వైట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా నెలలో రెండు, మూడు సార్లు చేస్తే ఫేస్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు పోయి.చర్మం యవ్వనంగా, కాంతివంతంగా తయారవుతుంది.
మరియు డార్క్ సర్కిల్స్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.