హనీ ఫేషియల్..వారంలో ఒక్క‌సారి చేసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

హ‌నీ(తేనె). మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండ‌ట‌మే కాదు అమోఘ‌మైన పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా తేనె అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.చ‌ర్మ సౌంద‌ర్యానికీ తేనె ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా తేనెతో వారానికి ఒక్క‌సారి ఇంట్లోనే ఫేషియ‌ల్ చేసుకుంటే గ‌నుక బోలెడ‌న్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు హ‌నీతో ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలో కింద‌కు ఓ లుక్కేసేయండి.

 Wonderful Benefits Of Honey Facial Details! Benefits Of Honey Facial, Honey Faci-TeluguStop.com

స్టెప్‌-1:

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబ‌ల్ స్పూన్ల తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత దూది సాయంతో ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టింది రెండు, మూడు నిమిషాల పాటు క్లెన్సింగ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

స్టెప్‌-2:

ఒక బౌల్ తీనుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గోధుమ ర‌వ్వ‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి కేవ‌లం రెండు నిమిషాల పాటు స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.స్క్ర‌బ్బింగ్ అయిన త‌ర్వాత నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Benefitshoney, Facial, Honey, Honey Facial, Latest, Lemon, Sandal P

స్టెప్‌-3:

బౌల్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని.అప్పుడు నీటితో చ‌ర్మాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి.

Telugu Tips, Benefitshoney, Facial, Honey, Honey Facial, Latest, Lemon, Sandal P

స్టెప్‌-4:

బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చంద‌నం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్క‌లు నిమ్మ ర‌సం, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా ప‌ట్టించి.ఇర‌వై నిమిషాల అనంత‌రం క్లీన్ చేసుకుంటే స‌రిపోతుంది.

ఈ విధంగా తేనెతో ఫేషియ‌ల్ చేసుకోవ‌డం వ‌ల్ల ముఖం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది.మొటిమ‌లు, మొండి మ‌చ్చ‌లు ఉంటే క్ర‌మంగా త‌గ్గుతాయి.త్వ‌ర‌గా చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటాయి.మ‌రియు ముఖ చ‌ర్మం స్మూత్‌గా కూడా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube