ఇటీవల కాలంలో ముప్పై ఏళ్లకే చర్మంపై ముడతలు ఏర్పడి యవ్వనత్వాన్ని కోల్పోతున్నారు.ఈ సమయంలో చర్మాన్ని కాపాడుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
వేలకు వేలు ఖర్చు చేసి మార్కెట్‌లో లభించే రకరకాల ప్రోడెక్ట్స్‌ను వినియోగిస్తారు.అయితే ఒక్కోసారి ఈ ప్రోడెక్ట్స్ సమస్యను తగ్గించకపోగా.
మరింత రెట్టింపు చేస్తాయి.
అయితే చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా మార్చడంలో స్ట్రాబెర్రీస్ అద్భుతంగా సహాయపడతాయి.
మరి స్ట్రాబెర్రీస్‌ని ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పడు తెలుసుకుందాం.ముందుగా స్ట్రాబెర్రీస్ ను పేస్ట్ చేసుకుని.
అందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి.పావు గంట పాటు ఆరనిచ్చి అనంతరం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల స్ట్రాబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి ముఖంపై ఉన్న ముడతలు, గీతలు పోగొట్టి.యవ్వనంగా మారుస్తుంది.అలాగే స్ట్రాబెర్రీస్ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.బాగా ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారడంతో పాటు… మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.
స్ట్రాబెర్రీస్ పేస్ట్‌లో కొద్దిగా బియ్యంపిండి, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా ముడతలు పోయి కాంతివంతంగా మారుతుంది.
మరియు మృదువుగా కూడా మారుతుంది.