మ‌చ్చ‌ల‌ను, ముడ‌త‌ల‌ను నివారించే ద్రాక్ష.. ఎలాగంటే?

ద్రాక్ష పండ్లు ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు.ద్రాక్ష పండ్ల‌లో కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం వంటి మిన‌రల్స్‌తో పాటు విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, ఫోలిక్ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉన్నాయి.

 Wonderful Beauty Benefits Of Grapes-TeluguStop.com

అటువంటి ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికే కాదు.చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో ద్రాక్ష పండ్లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ద్రాక్ష పండ్ల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 Wonderful Beauty Benefits Of Grapes-మ‌చ్చ‌ల‌ను, ముడ‌త‌ల‌ను నివారించే ద్రాక్ష.. ఎలాగంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందు కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ ద్రాక్ష పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే కొన్ని ద్రాక్ష పండ్లు తీసుకుని.వాటి నుంచి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో ముల్తానీ మ‌ట్టి మ‌రియు రోజ్‌వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు త‌గ్గుముఖం.ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇక జిడ్డు చ‌ర్మాన్ని నివారించడంలోనూ ద్రాక్ష పండ్లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ద్రాక్ష పండ్లు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.అందులో నిమ్మ ర‌సం, పుదీనా ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

పావు గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే జిడ్డు చ‌ర్మానికి దూరంగా ఉండొచ్చు.

#Skin Care #Grapes #Grapes #Benefits Grapes #Benefits Grapes

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు