త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే.. మొటిమల్లేని మెరిసే చ‌ర్మం మీ సొంతం!

త‌మ‌ల‌పాకు.వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Wonderful Beauty Benefits Of Betel Leaf! Beauty Tips, Beauty, Betel Leaf, Betel-TeluguStop.com

ముఖ్యంగా మ‌న భార‌తీయులు పూజ‌లు చేసే స‌మ‌యంలో, తాంబూలం ఇచ్చే స‌మ‌యంలో త‌మ‌ల‌పాకుల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.అయితే త‌మ‌ల‌పాకు ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఫోలిక్ యాసిడ్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, క్యాల్షియం, ఐర‌న్ ఇలా ఎన్నో పోష‌కాలు దాగున్న త‌మ‌ల‌పాకు ఎన్నో జ‌బ్బుల‌ను నుంచి ర‌క్షిస్తుంది.అలాగే మొటిమ‌ల్లేని మెరిసే చ‌ర్మాన్ని అందించ‌డంలోనూ త‌మ‌ల‌‌పాకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే త‌మ‌ల‌పాకుల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.యువ‌తీ, యువ‌కుల‌ను ఎక్కువ‌గా వేధించే చ‌ర్మ స‌మ‌స్య మొటిమ‌లు.ఈ మొటిమ‌ల వ‌ల్ల ముఖం కాస్త అంద‌హీనంగా క‌నిపిస్తుంటుంది.అందేకే ఎలాగైనా మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారు త‌మ‌ల‌పాకులు తీసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి.ఆ త‌మ‌ల‌పాకుల పేస్ట్‌లో కొద్దిగా తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేస్తే మొటిమ‌లు పోవ‌డంతో పాటు ముఖం తాజాగా మారుతుంది.

రెండొవ‌ది.త‌మ‌ల‌పాకుల‌ను మొత్త‌గా పేస్ట్ చేసుకుని.

అందులో కొద్దిగా శెన‌గ‌పిండి మ‌రియు ప‌సుపు వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

పావు గంట‌ త‌ర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణాలు పోయి.

కాంతివంతంగా మెరుస్తుంది.

మూడొవ‌ది.

త‌మ‌ల‌పాకుల‌ను మొత్త‌గా చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

అనంత‌రం ఓ పావు గంట‌ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

ముఖంలో కొత్త కాంతి సంత‌రించుకుంది.అలాగే ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు, ముడ‌త‌లు పోయి.

య‌వ్వ‌నంగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube