ఈ వండర్ ఉమెన్ కి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమట..?

రెడ్ నోటిస్ మూవీ సక్సెస్ లో దూసుకుపోతోంది.వండర్‌ వుమెన్‌ గాల్ గాడోట్‌, డ్వేన్‌ జాన్సన్, రేయాన్‌ రెనాల్డ్స్‌ కలిసి నటించారు.’రెడ్‌ నోటీస్’ మూవీ సక్సెస్‌లో భాగంగా ఈ విజయాన్ని ఆనందిస్తున్న గాల్‌ గాడోట్‌ ఇటీవల తనకు ఎంతో ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పుకొచ్చింది.ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్‌ చికెన్‌ అంటే చాలా ఇష్టమని గాల్ గాడోట్ తెలిపింది.

 Wonder Woman Gal Gadot Loves Indian Food Gal Gadot, Indian Food, Red Notice, Net-TeluguStop.com

ఇంకా ఆ వీడియోలో ఆమెకి మసాల చికెన్‌ టిక్కా అంటే చాలా ఇష్టం అని ఆమె చెప్పు కొచ్చింది.అందులో వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్‌ చికెన్‌ అంటే చాలా చాలా చాలా ఇష్టం గాల్ గాడోట్ తెలిపింది.

అలాగే భారతీయ వంటకాలలో పెరుగు కూడా ఇష్టమే అని నేను భారీతీయ వంటకాలను ఇష్టపడతాననీ ఆమె చెప్పు కొచ్చింది.రెడ్‌ నోటీస్‌ ను ఇంతలా ఆదరించినందుకు సినిమా నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు.

రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన రెడ్ నోటిస్ సినిమా నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

Telugu Dwayne Johnson, Gal Gadot, Indian, Netflix, Red, Ryan Reynolds-Movie

గత నవంబర్ 12న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ లో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.రెడ్ నోటీస్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని పట్టుకోవడం ఇంటర్ పోల్ జారీ చేసే గ్లోబల్ హెచ్చరిక.ఇందులో మోస్ట్ వాంటెడ్ దొంగగా గాల్ గడోట్ అద్భుతంగా నటించింది.

డిస్నీ సంస్థలో రాబోయే లైవ్ యాక్షన్ అడాప్టేషన్ మూవీ స్నో వైట్ లో గాడోట్ ఈవిల్ క్వీన్ గా నటించనుంది.ఈ సినిమా బ్రదర్స్ గ్రిమ్ అద్భుత కథ ఆధారంగా తెరకెక్కనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube