అద్బుతం : 3 వేల ఏళ్ల క్రితం చనిపోయిన గాయకుడి మమ్మీతో మాట్లాడించారు, ఎలాగో తెలుసా?  

Wonder Mummy Speaks Again After 3,000 Years-3,egyptian Mummy,egyptian Priest Nesyamun,mummified Body,vocal Tract,నెశ్యామన్‌

కాలం మారుతున్నా కొద్ది గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయి.గుండెను తీసి గుండె పెట్టేంతగా సైన్స్‌ అభివృద్ది చెందింది.

Wonder Mummy Speaks Again After 3 000 Years-3 Egyptian Priest Nesyamun Mummified Body Vocal Tract నెశ్యామన్‌

త్వరలోనే చనిపోయిన మనిషిని కూడా బతికించేలా సైన్స్‌ అభివృద్ది అవుతుందేమో అంటున్నారు.అది అలా ఉంచితే దాదాపుగా మూడు వేల క్రితం చనిపోయినట్లుగా చెప్పుకుంటున్న ప్రముఖ గాయకుడు నెశ్యామన్‌ అనే వ్యక్తి మమ్మీని ఈజిప్ట్‌ వారు అత్యంత భద్రంగా చూసుకుంటూ ఉన్నారు.

ఆ మమ్మీ అప్పట్లో ఇంగ్లాండ్‌లో మ్యూజియంలో ఉంచారు.

నెశ్యామన్‌ క్రిస్తు పూర్వ 11వ శతాబ్దంకు చెందిన వాడుగా చెబుతున్నారు.

అప్పట్లో ఈయన పాటలు అద్బుతం అంటూ చరిత్ర చెబుతుంది.అందుకే ఆయన మమ్మీపై ప్రయోగాలు చేసి ఆయన్ను మళ్లీ మాట్లాడించాలని, పాట పాడించాలని శాస్త్రవేత్తలు భావించారు.

ఆయన్ను బతికించడం సాధ్యం కాదు కాని, ఆయతో మాట్లాడించడం సాధ్యమే అంటూ శాస్త్రవేత్తలు అనుకున్నారు.అనుకున్నట్లుగానే స్వర పేటిక ద్వారా గాలి పంపిస్తూ అతడి మాటల తీపిదనం తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఇంగ్లాండ్‌ శాస్త్రవేత్తలు ఏదైతే అనుకున్నారో అది నిజం అయ్యింది.మమ్మీతో మాట్లాడించేందుకు వారు చేసిన రెండు సంవత్సరాల కృషి ఫలించింది.

అంతా అబ్బురపడే ఆ గొంతును వినిపించారు.స్వర మార్గంను త్రిడి ప్రింటింగ్‌ ద్వారా పునరుద్దరించి గాలిని పంపించడం వల్ల అప్పట్లో అతడి గొంతు ఎలా ఉండేదో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

ఇది నిజంగా అద్బుతం.మూడు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తితో మాట్లాడించేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ముందు ముందు ఇలాంటి ఆవిష్కరణలు అద్బుతాలు మరెన్ని జరుగుతాయో కదా.!

.

తాజా వార్తలు

Wonder Mummy Speaks Again After 3,000 Years-3,egyptian Mummy,egyptian Priest Nesyamun,mummified Body,vocal Tract,నెశ్యామన్‌ Related....