వ్యాక్సిన్ వేసుకుంటే 5 వేలు.. చేయాల్సింది ఏంటంటే..!

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికే ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు.

 Won 5000 Rupees With Vaccination Share Picture And Tagline, Five Thousand Rupees-TeluguStop.com

ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్న వారికి సెకండ్ డోస్ కొనసాగిస్తున్నారు.ఇక 18 ఏళ్లు పైన వయసు గల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.వైరస్ వ్యాప్తి చెందకుండా సురక్షితంగా ఉండేలా వ్యాక్సిన్ వేయడమే కాకుండా వ్యాక్సిన్ వేసుకున్న వారికి 5 వేల రూపాయలు కూడా గెలుచుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసింది.

అదెలా అంటే ఏముంది మనం కూడా సెలబ్రిటీల్లా వ్యాక్సిన్ వేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి.వ్యాక్సిన్ వేసుకున్న వారు ప్రభుత్వం తెలిపిన వెబ్ సైట్ లో ఫోటోని షేర్ చేయాలి.

ఆ ఫోటోతో పాటుగా వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా కొటేషన్ రాయాల్సి ఉంటుంది.ఆ ట్యాగ్స్ వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి తెలిసేలా ఉంటే బెటర్.

అయితే ఇలా వచ్చిన ఫోటోలలో నెలకు 10 మందిని సెలెక్ట్ చేసి ప్రభుత్వం ఎంపిక చేసి వారికి ఐదు వేల రూపాయలు అందిస్తుందని తెలుస్తుంది.అయితే దీనికోసం myGov.in పోర్టల్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

మీ వివరాలన్ని ఇచ్చాక వ్యాక్సిన్ వేసుకున్నప్పటి ఫోటోని జత చేసి పంపితే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube