మహిళల ఐపీఎల్ జట్ల షెడ్యూల్ విడుదల..!

బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది.మహిళల విభాగంలో జరిగే టి20 చాలెంజ్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) సోమవారం విడుదల చేసింది.

 Women's Ipl Teams Schedule Released  Women's Ipl, Schedule, Bcci, Ipl, Sports Up-TeluguStop.com

ఈ టోర్నీ చివరగా 2020లో జరిగింది.కరోనా కారణంగా మహిళల టోర్నీ జరగలేదు.

ఈవెంట్‌ నాల్గో సీజన్‌ మే 23న ప్రారంభం అవుతుంది.మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది.

ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది.అన్ని మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

అయితే గత మూడు సీజన్లలో వెలాసిటీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఈసారి మాత్రం ఆడటం లేదు.ఆమె స్థానంలో దీప్తి శర్మ ను వెలాసిటీ కెప్టెన్ గా వ్యవహరించనుంది.

ట్రయిల్ బ్లేజర్స్ కు స్మృతి మంధాన, సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు సారథులుగా వ్యవహరించనున్నారు.గతంలో ట్రయిల్ బ్లేజర్స్ జట్టులో భాగంగా ఉన్న జులన్ గోస్వామి, శిఖా పాండేలు కూడా ఈ ఏడాది ఆడటం లేదు.

ఈ టోర్నీ గురించి ప్రకటన చేసిన బీసీసీఐ.

Telugu Bcci, Latest, Schedule, Ups, Womens Ipl-Latest News - Telugu

‘భారత మహిళా క్రికెట్‌లోని అత్యుత్తమ ప్లేయర్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ప్రముఖ ప్లేయర్లతో కలిసి జట్లు ఏర్పడ్డాయి.ఈ ఏడాది మహిళల టీ20 ఛాలెంజ్‌లో మొత్తం పన్నెండు మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఆడుతున్నారు.’ అని బీసీసీఐ అధికారిక ప్రకటన పేర్కొంది.ఈమేరకు ఒక్కొక్క జట్టులో 16మంది ప్లేయర్లతో కూడిన మూడు జట్లను ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది మే 23న జరిగే తొలి మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ తో సూపర్ నోవాస్ ఆడుతుంది.మే 24న వెలాసిటీతో సూపర్ నోవాస్, మే 26న ట్రయిల్ బ్లేజర్స్ తో వెలాసిటీ జట్లు ఆడతాయి.

ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది.టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube