ఉమెన్స్ డే స్పెషల్.. ఆ ముగ్గురుతో వచ్చిన పవన్ !

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలంగా అటు రాజకీయాలు చూసుకుంటూనే ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు.ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండడం వల్ల ఈ లోపు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని చేయాలనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.

 Women's Day Special Vakeel Saab Poster Released, Pawan Kalyan, Dil Raju, Nivetha-TeluguStop.com

ప్రస్తుతం ఈ హీరో చెయ్యని విధంగా ఒకే సారి రెండుమూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, నివేతా థామస్, అనన్య కీలకమైన రోల్స్ చేస్తున్నారు.

దిల్ రాజు, బోణీ కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ రోజు మార్చి 8 న మహిళా దినోత్సవ సందర్భంగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ రోజు వకీల్ సాబ్ నుండి ఒక పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి, నివేతా థామస్, అనన్య కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసారు.

ఈ ముగ్గురు హీరోయిన్స్ వ్యభిచార గృహంలో చిక్కుకుంటే పవన్ కళ్యాణ్ వారిని కాపాడడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ.ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్స్ సినిమా కే కీలకంగా మారనున్నారు.

https://twitter.com/DilRajuofficial/status/1368789851227627525/photo/1

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube