వైరల్‌ : స్కూల్‌ అమ్మాయి కలెక్టర్‌ అయ్యింది, అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇలాంటివి మామూలుగా అయితే సినిమాల్లోనే చూస్తాం.ఒక్క రోజు సీఎం అవ్వడం, ఒక్క రోజు కలెక్టర్‌ అవ్వడం అనేది చనిపోయే వారి కోరిక తీర్చడం కోసం చేస్తూ ఉంటారు.

 Womens Day Special School Girl Become A Collector In Maharashtra-TeluguStop.com

కాని మొదటి సారి విభిన్నంగా విద్యార్థులుగా మంచి ప్రతిభ కనబర్చినందుకు గాను ఈ విధంగా చేస్తున్నారు.మహారాష్ట్రలో ఒక కలెక్టర్‌ చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

ఆమె పిల్లల్లో పట్టుదల మరియు అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసంను పెంచేందుకు ఇలాంటి పని చేసినట్లుగా చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.

మహారాష్ట్రకు చెందిన కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ చంద్ర మహళ దినోత్సవం సందర్బంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అమ్మాయిలకు టెస్టు నిర్వహించారు.

ఆ టెస్టుల్లో టాప్‌లో వచ్చిన కొందరిని ఒక్క రోజు కలెక్టర్‌గా నియమిస్తూ తన చైర్‌లో కూర్చోబెట్టడం జరిగింది.అమ్మాయిల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Maharashtra, Poonam Deshmukh, School, Sumanravath, Womens Day, Womensday-

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు పూనమ్‌ దేశ్‌ ముఖ్‌.ఈమె ఒకరోజంతా కూడా కలెక్టర్‌గా పని చేసింది.పదిహేను ఏళ్ల వయసు ఉన్న ఈ అమ్మాయి రోజులో పలు సమీక్షలు నిర్వహించడంతో పాటు పలువురు అధికారులతో పాలన సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు.అలా ఈ అమ్మాయి కలెక్టర్‌గా నామమాత్రంగా కాకుండా ఫుల్‌ ప్లెడ్జ్‌గా కలెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించింది.

ప్రస్తుతం ఈ విషయం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఇలాంటి గౌరవం ఇవ్వడంపై కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

మీరు ఇలాంటి పని చేయడం గొప్ప విషయం అంటూ కలెక్టర్‌పై నాయకులు మరియు ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube