అమెరికాలో భారతీయుడి ఉమెన్స్ డే గిఫ్ట్ మాములుగాలేదుగా  

Womens Day Liquor Store Owner In Us Sold 1000 Wine Bottles-a Penny Apiece,tandon\\'s Shop,womens Day

మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన టాండన్ అనే కొలంబియాలోని హైట్స్‌లో లో ఓ వైన్ షాప్ నడుపుతున్నాడు. మహిళా దినోత్సవం రోజున ఎదో ఒక వినూత్న కార్యక్రమాని చేయాలని భావించిన అతడు అనుకున్నదే తడవుగా కేవలం 50 పైసలేకె వైన్ బాటిల్ ని కానుకగా ఇచ్చాడు. దాంతో అతడి పేరు అమెరికా వ్యాప్తంగా మారు మొగిపోయింది...

అమెరికాలో భారతీయుడి ఉమెన్స్ డే గిఫ్ట్ మాములుగాలేదుగా-Womens Day Liquor Store Owner In US Sold 1000 Wine Bottles

ఇదే రీతిలో గత ఏడాది 200 వైన్ బాటిళ్లను విక్రయించిన టాండన్. ఈసారి ఏకంగా 1000 బాటిళ్లను విక్రయించాడు. దీంతో ఆ ఒక్కరోజులో అతగాడి షాపుకు ఓ రేంజ్ లో మహిళలు పోటెత్తారట. ఈ కార్యక్రమం ద్వారా తన షాప్‌కు ఎంతో మంది నూతన కస్టమర్లు కూడా వచ్చారని టాండన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు మహిళలకు వైన్ బాటిళ్లను విక్రయించినట్టుగా అతడు తెలిపాడు.

అయితే 50 పైసలకి ఎందుకు ఉచితంగా ఇచ్చేయచ్చు కదా అంటే , అక్కడి చట్టం ప్రకారం ఉచితంగా వైన్ ఇవ్వకూదట అందుకే ఇలా 50 పైసలకి అమ్మినట్టు తెలిపారు టాండన్. ఇదిలాఉంటే మరి కొందరు మహిళలు మాత్రం మహిళా దినోత్సవం రోజున వైన్ బాటిళ్లను పంచడాన్ని తప్పుబట్టారు.