మద్యానికి బానిసలైన మహిళలు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈకాలంలో మహిళలు, పురుషులు అని తేడాలేదు.ఎవరికి నచ్చిన పని వారు చేసేస్తుంటారు.

 Womens, Addicted To Alcohol, Stress, Covid-19, Corona Virus-TeluguStop.com

ఇక అలానే ఇప్పుడు మహిళలు కూడా మద్యానికి బానిసలవుతున్నారు.నిజానికి పాశ్చాత్య దేశాల్లో మహిళలు మద్యం సేవించడం చాలా సాధారణమైన విషయం.

కానీ మన భారత దేశంలో మద్యం ఆడవాళ్లు సేవించడం అనేది చాలా అరుదు.ఎక్కడో సినీ సెలబ్రెటీలు, డబ్బు ఉన్నవారు.

లేదంటే మరీ లోక్లాస్ ఆడవాళ్లు ఏలాంటి నియమాలు పాటించకుండా మద్యాన్ని సేవిస్తారు.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని మిడిల్ క్లాస్ మహిళలు కూడా మద్యానికి బానిసలవుతున్నారు.

ఈ విషయం కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం.ఆరోగ్యంగా అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా కరోనా మహమ్మారి తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.

కరోనా వైరస్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతోమంది మహిళలు మద్యానికి బానిసలయ్యారని ఓ వైద్య రిపోర్ట్ చెప్తుంది.

అయితే కరోనా వైరస్ కి ముందు ఎంతోమంది మహిళలు ఉద్యోగపరంగా బయట ఉంటూ ఆనందంగా స్వేచ్ఛగా ఉన్నవాళ్లు ఇంట్లో ఉండేసరికి బంధీలుగా అయ్యారు.

ఒకవైపు అత్త వేధింపు.భర్త చిగురింపులు భరించలేక ఎంతోమంది మహిళలు ఒత్తిడికి గురయ్యారు.

మరికొందరు మహిళలు ఉద్యోగంలో అభద్రతాభావం, పిల్లల పెంపకం అన్ని భరించలేక ఒత్తిడికి గురయ్యారు.

ఇక ఆ సమయంలోనే ఎంతోమంది మహిళలు మద్యం సేవించడం ప్రారంభించి దానికి బానిసలుగా మారారని నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటాస్టిక్స్ నివేదిక తెలిపింది.

ఇక ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.పట్టాణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలే అత్యధికంగా మద్యానికి బానిసలయ్యారని నివేదిక తెలుపుతుంది.కాగా మద్యానికి బానిసై మరణించిన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారట.18 శాతం మగవాళ్లు మద్యానికి బానిసయ్యి మరణిస్తే 23 శాతం ఆడవాళ్లు మద్యానికి బానిసయ్యి మరణించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube