అయ్యో.. భూకంపం అని భయపడి వంటలక్క సీరియల్ చూడలేదట!

మనం ఇళ్లలో ఉన్నప్పుడు ఇల్లు కపించినట్లు, లేదా మన ఇంట్లోని వస్తువులు అదురుతున్నట్టు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఇంటిలో నుంచి బయటకు పరుగులు తీస్తాం.ఇంట్లో ఎలాంటి ముఖ్యమైన వస్తువులు ఉన్నాకూడా, వాటికన్న ప్రాణమే మిన్న అని పరుగులు పెడతాం.

 Borabanda People Afraid Of Sounds, Borabanda, Woman Worried About Vantalakka Ser-TeluguStop.com

అయితే శుక్రవారం రాత్రి బోరబండలో వీకేర్స్ కాలనీలోని ప్రజలు పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

అయితే అక్కడ ఒక విచిత్ర సంఘటన ఎదురైంది.

అది ఏమిటంటే? స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటిస్తున్న దీపకి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.అందుకు ఉదాహరణగా ఇంతటి భయాందోళనక పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఈ శబ్దాలకు భయపడి రాత్రి వంటలక్క సీరియల్ (కార్తీకదీపం) చూడలేదని వాపోయింది.

ఈ మాట విన్న పలువురు ఆశ్చర్యపోయారు.ఈ మాటలతోనే కార్తీకదీపం సీరియల్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ఇట్టే తెలిసిపోతుంది.శుక్రవారం రాత్రి బోరబండ లో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో భూకంపం వచ్చిందేమో అన్న భయంతో అక్కడి ప్రజలు బయటకు పరుగులు తీశారు.రాత్రంతా కాలనీలోనే నిద్ర పోయారు.

మరి కొందరు ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతూ మేలుకునే ఉన్నారు.

అయితే ఆ కాలనీలో ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆ కాలనీవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

భూమి లోపల నీటి ప్రవాహం ఉంటే ఇలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.అక్కడ ఎటువంటి నష్టం జరగక పోయినప్పటికీ ఆ కాలనీవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

ఇంతటి భయాందోళనక సమయంలో కూడా ఒక మహిళ ఈ శబ్దం వల్ల భయంతో బయటకు పరుగులు తీసి రావడం వల్ల కార్తీకదీపం సీరియల్ చూడలేదని బాధపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube