బోగీల మధ్య లింక్ పై కూర్చొని బాలింత ప్రయాణం వైరల్ అవ్వుతున్న వీడియో చాలా పాతది

పొట్టకూటి కోసం సొంత గ్రామాలను వదిలి వలస వెళ్లిన కార్మికులను కరోనా మహమ్మారి అష్టకష్టాలకు గురి చేస్తుంది.ఎందుకు ఈ జీవితం అనేలా తయారు చేసింది.

 Women With Child Sitting On Train Compartment Link  Coronavirus, Lock Down, Wome-TeluguStop.com

లాక్ డౌన్ తో ఉన్న చోటా ఉపాధి లేక, సొంత గ్రామాలకు వెళ్లే మార్గం లేక దారుణంగా ఇబ్బంది పడ్డారు వలస కార్మికులు.ఉన్న చోటా ఉండలేక.

ఎలా అయినా సరే సొంత గ్రామాలకు చేరుకోవాలి అని కొందరు కొన్ని వేళ కిలోమీటర్లు కాలినడకన నడిచి ప్రాణాలు పోగొట్టుకుంటే.మరికొందరు మమ్మల్ని మా గ్రామాలకు చేర్చండి అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

కానీ కొందరు మాత్రం సాహసాలు చేశారు.ఎలా అయినా రావాలి అని ఎక్కడ దారి ఉంటే అక్కడ నుండి స్వగ్రామానికి చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ పసి బిడ్డను పొదివి పట్టుకున్న ఓ బాలింతరాలు రెండు రైలు బోగీల మధ్య ఉన్న లింకుపై కూర్చుని అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంకా ఈ వీడియో చుసిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎంత కష్టం వచ్చింది తల్లీ నీకు అంటూ ట్విట్టర్ వేదికగా వాపోయారు.ట్విట్టర్ వేదికగా డీసీపీ ఇలా స్పందించారు.”నీ అవస్థ చూసి నా మనసు తల్లడిల్లిపోతోంది.ఎందుకీ అభివృద్ధి, ఎందుకీ సంపద? నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడంలేదు.అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా.నన్ను క్షమించు తల్లీ!” అంటూ ట్వీట్ చేశారు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Corrections on 05/14/2020

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియో చాల పాత వీడియో , ఇది తాజా వీడియో అని అందరు భావిస్తున్నారు కాని ఇది చాల పాత వీడియో అన్ని గమన్నించగలరు.ఒరిజినల్ పోస్ట్ లో తప్పుగా పోస్ట్ చేసినందుకు మన్నించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube