వైరల్‌ : అమ్మాయిలు జీన్స్‌ వేసుకుంటే పిల్లలు హిజ్రాలుగా పుడతారా? డాక్టర్ల మాట

భారతీయ స్త్రీలు ఒకప్పుడు చీరలు మాత్రమే కట్టుకునే వారు.కాని కాల క్రమేనా ఉద్యోగాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల మోడ్రన్‌ డ్రస్‌లు జీన్స్‌లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరానికి తగ్గట్లుగా అమ్మాయిలు ఆంటీలు ఇప్పుడు డ్రస్‌లు వేసుకుంటున్నారు.

 Women Who Wear Jeans-TeluguStop.com

ఎలాంటి డ్రస్‌లు వేసుకుంటే ఏంటీ అమ్మాయిలు అన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి అనేది కొందరి మాట.కాని కొందరు మాత్రం ఆడవారు మోడ్రన్‌ డ్రస్‌లు వేయడంను అస్సలు ఒప్పుకోవడం లేదు.ఇక గత కొన్ని వారాలు నెలలుగా అమ్మాయిలు జీన్స్‌ ఎక్కువగా వేస్తే వారికి పుట్టబోయే పిల్లలు హిజ్రాలుగా పుడతారు అంటూ కొందరు వాదన మొదలు పెట్టారు.

Telugu Doctors, Indian Womens, Kerala, India, Wearjeans-General-Telugu

ముఖ్యంగా కేరళలోని కొందరు ఈ వాదనను బలంగా ప్రచారం చేస్తున్నారు.జీన్స్‌ వేసుకున్న వారికి పుట్టబోయే పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అని, కొందరు హిజ్రాలుగా కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఆడవారు ఆందోళన చెందుతున్నారు.జీన్స్‌ వేసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది.

అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే అని, దీన్ని ఎవరో కావాలని పుట్టించారంటూ మహిళ సంఘాల వారు డాక్టర్‌ సందేశాలతో సహా నిరూపిస్తున్నారు.

Telugu Doctors, Indian Womens, Kerala, India, Wearjeans-General-Telugu

అమ్మాయిలు జీన్స్‌ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవని వైధ్యులు చెబుతున్నారు.ముఖ్యంగా వారు జీన్స్‌ వేసుకుంటే పుట్టబోయే పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు.మగవారు జీన్స్‌ ఎక్కువ వేసుకుంటే వారి స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశం ఉంది కాని ఆడవారి విషయంలో అలాంటి అవకాశం కూడా లేదని, వారు ఎలాంటి ఆందోళన లేకుండా జీన్స్‌లు వేసుకోవచ్చు అంటూ వైధ్యులు చెబుతున్నారు.

గర్బవతులుగా ఉన్న సమయంలో జీన్స్‌లకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube