యాంకర్ ప్రదీప్ కు అనుకోని ట్విస్ట్..! త్వరలో ఆగిపోనున్న 'పెళ్లిచూపులు' షో.! అసలేమైంది.?   Women Welfare Society Demands To Stop Pradeep Pellichoopulu     2018-11-04   07:56:45  IST  Sainath G

బిగ్ బాస్ ముగియగానే మరో కొత్త షో కు తెరతీసింది మా టీవీ. ప్రదీప్, సుమ కీ రోల్ లో “పెళ్లి చూపులు” స్టార్ట్ అయ్యింది. కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ షో. యాంక‌ర్ ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఈ షో ద్వారా ఎంపిక చేసుకుంటున్నట్లు ప్ర‌చారం చేస్తొంది. అయితే ఈ షో కు ఇప్పుడు పెద్ద బ్రేక్ పడింది.

పెళ్లి చూపులు’ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ రాయలసీమ మహిళా సంఘ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద మహిళలు ధర్నా చేశారు. ఆడవాళ్లను అంగడి సరుకును చేసి అవమానిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌, ప్రోగ్రాం నిర్వహిస్తున్న సుమ, ప్రసారం చేస్తున్న టీవీ యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీసున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అన్నారు. తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకు భంగం కలిగించే విధంగా ఈ టీవీ షో నిర్వహిస్తున్నారన్నారు.

Women Welfare Society Demands To Stop Pradeep Pellichoopulu-

పెళ్లి చూపుల పేరుతో మహిళలను కించపరిచే యాంకర్‌ ప్రదీప్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, యాంకర్‌ సుమపై, టీవీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ షో త్వరలోనే ఆపేస్తున్నారు అనే మాట కూడా బుల్లితెర రంగంలో వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి!