భర్త పాస్ పోర్ట్ తో ప్రియుడిని 'ఫారెన్'కు తీసుకెళ్లింది.. చివరికి?

ఈ మధ్య కాలంలో వివాహేతర బంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కొందరు మహిళలు ఈ బంధాల పట్ల ఆకర్షితులై ఎంతకైనా తెగిస్తున్నారు.

 Women Use Husband Passport To Take Lover Australia Tour  Women, Husband Passport-TeluguStop.com

తాజాగా ఒక మహిళ ప్రియుడితో విదేశాలకు వెళ్లడం కోసం ఏకంగా భర్త పాస్ పోర్ట్ నే వినియోగించుకుంది.భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు మహిళ బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ ఈ దారుణానికి పాల్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే యూపీకి చెందిన ఒక మహిళ ప్రియుడితో ఫారెన్ ట్రిప్ కు వెళ్లాలనుకుంది.

అయితే ప్రియుడికి పాస్ పోర్ట్ లేకపోవడంతో భర్త పాస్ పోర్ట్ తో ప్రియుడిని ఫారెన్ కు తీసుకుళ్లాలని నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాకు ప్రియుడితో వెళ్లిన మహిళ మార్చిలో ఇంటికి రావాలని అనుకుంది.

అయితే ఊహించని విధంగా కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల మహిళ అక్కడే ప్రియుడితో మరికొన్ని నెలలు ఉండిపోవాల్సి వచ్చింది.

వందే భారత్ మిషన్ లో భాగంగా ఆగష్టు నెల 24వ తేదీన మహిళ తన ప్రియుడితో కలిసి ఇండియాకు రాగా తన పాస్ పోర్ట్ ను ఫోర్జరీ చేసి భార్య ప్రియుడితో కలిసి ఫారెన్ కు వెళ్లి వచ్చిందని భర్త ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలోని ఫిలిబత్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెటిజన్లు ఈ ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube