కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వస్తుందని చైనాలో ఓ మహిళ ఏకంగా....

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి కరోనా వైరస్ సోకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఈ వ్యాధి లక్షణాలు సోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

 Women Trying To Heat Currency In China For Corona Viruss-TeluguStop.com

అయితే సాధారణంగా ఈ కరోనా వైరస్ తుమ్ములు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తొందరగా సోకే ప్రమాదం ఉంటుంది.అంతేగాక ఈ సమస్యలతో బాధపడుతున్న వారితో కరచాలనం చేయడం గాని, లేదా వాళ్లు దగ్గడం తుమ్మడం ఇలాంటివి చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ వైరస్ ఇతరలకి సోకుతుంది.

అయితే తాజాగా వైద్య నిపుణులు కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పడంతో చైనాలోని ఓ మహిళ ఏకంగా ఎన్నో రోజులుగా దాచుకున్నటువంటి డబ్బుని వేడి చేసేందుకు యత్నించి దెబ్బతింది.

వివరాల్లోకి వెళితే జియాంగ్ ఇన్ అనే నగరంలో అంట్ లీ అనే మహిళ నివాసం ఉంటోంది.

ఇటీవల కాలంలో అంట్ లీ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం ద్వారా కొంత నగదును విత్ డ్రా చేసింది.ఈ క్రమంలో  ఎటిఎం నుంచి తీసుకువచ్చినటువంటి కరెన్సీ నోట్లకి వైరస్ ఉందేమోనని భయపడినటువంటి అంట్ లీ తన వద్ద ఉన్నటువంటి నగదును మరియు తాను విత్ డ్రా చేసినటువంటి నగదును కలిపి మైక్రో ఓవెన్లో నిర్దిష్టత ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం మొదలు పెట్టింది.

అయితే ఈ క్రమంలో వేరే పనిలో పడి మైక్రోఓవెన్ లో నోట్ల సంగతి మరిచింది.దీంతో నోట్లు మొత్తం పెళుసుగా తయారై అధ్వాన్న స్థితిలో చేరుకున్నాయి.దీంతో చేసేదేమీ లేక అంట్ లీ ఆ నోట్లను మార్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడింది.

Telugu Ant Lee, Currency China, Currency-Latest News - Telugu

అయితే తాజాగా ఈ కరోనా వైరస్ భారతదేశంలో కూడా కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదుకి పైగా పాజిటివ్ కేసులను వైద్యులు నిర్ధారించారు.అంతేగాక ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ఎయిర్ పోర్ట్ లలో ఈ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ పలు నివారణ చర్యలు చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube