దారుణం: ప్రేమించలేదని మహిళా ఎస్సైని దారుణంగా....

అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పోలీసు మహిళా ఎస్సైని దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో కలకలం రేపింది.

 Women Sub Inspector Killed In Delhi-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ప్రీతి అనే మహిళా ఎస్సై ఢిల్లీ నగరంలోని రోహిణి ఏరియా పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది.అయితే నిన్నటి రోజున విధులు ముగించుకొని రాత్రి 9.30 నిమిషాల సమయంలో  గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఎటువంటి ప్రీతి అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో ఒక్కసారిగా దేశరాజధాని ఉలిక్కిపడింది.అయితే ఇది గమనించిన ట్వంటీ స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Telugu Delhi, Delhi Latest, Love-Telugu Crime News(క్రైమ్ వార

సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే పోలీసులు ఈ కేసును చేధించే పనిలో పడ్డారు.అయితే గతంలో ప్రీతి బ్యాచ్ మేట్ అయినటువంటి దీపాన్షు రథి అనే వ్యక్తి కూడా అదే రాత్రి హర్యాణాలో ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ఇతడు పలుమార్లు ప్రీతిని ప్రేమిస్తున్నారని వెంటపడేవాడు.కానీ ప్రీతి అతనిని ప్రేమించడం ఇష్టం లేదని చెప్పేది.దీంతో తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతోనే దీపాన్షు రథి ప్రీతిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అంతేగాక హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ జిల్లాలో పరిశీలిస్తూ హంతకులను పట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న టువంటి పలు ప్రజా సంఘాల నాయకులు పోలీసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దోషులను శిక్షించే పోలీసులకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాక దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఈ మహిళ భద్రత విషయంలో పలు కఠిన చట్టాలను తీసుకు రావాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube