ఏంది భయ్యా ఇది : అక్కడ అమ్మాయిలకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదంట...

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అభివృద్ధి పరంగా ఎంతో ముందుకు పోతున్నప్పటికీ కొన్ని దేశాలు మాత్రం వారి వింత ఆచారాలు, మూఢనమ్మకాలను పాటిస్తూ వెనుకబడి పోతున్నాయి.ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాల్లోని మహిళలు అంతరిక్షంలోకి వెళుతూ ఉంటే కానీ ఆ దేశంలో మాత్రం మహిళలకు కరచాలనం చేయడం కూడా తప్పుగా భావిస్తారు.

 Women Shake Hands Banned In Afghanistan, Women Shake Hands News, Afghanistan Cou-TeluguStop.com

ఇప్పుడు అలాంటి దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…

ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల ను ఆఫ్ఘనిస్తాన్ దేశం ఒకటి.ఈ దేశంలో తమ పూర్వీకులు నేర్పించిన  సాంప్రదాయాలు మరియు ఆచారాలను ప్రజలు క్రమం తప్పకుండా పాటిస్తుంటారు.

కాగా ఇందులో పెళ్లయిన లేదా పెళ్లి కాని ఆడవాళ్ళు అర్థనగ్నంగా లేదా పొట్టి దుస్తులు దరించ కూడదు. ఒకవేళ ఇలా పొట్టి దుస్తులు ధరించి బయటకు వస్తే కచ్చితంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందువల్ల మహిళలు ఖచ్చితంగా బురఖా ధరించి బయటకు వస్తారు. అంతేగాక ఈ దేశంలో మహిళలతో పురుషులు కరచాలనం చేయడం పూర్తిగా నిషేధించారు.అలాగే బహిరంగ ప్రదేశాల్లో యువతీ యువకులు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరగరాదు.ఈ దేశంలో ప్రేమ, పెళ్లి బంధాలపై  ప్రజలకి పూర్తిగా నమ్మకం ఉంటుంది.

 అందువల్లనే ఈ దేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

ఇక ఈ దేశంలో ఎక్కువగా ప్రజలు డబ్బు సంపాదించడానికి వ్యవసాయంపై ఆధారపడ్డారు.

 ఇందులో భాగంగా తమ దేశంలో పండించినటువంటి కూరగాయలు మరియు మసాలా దినుసులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తారు. కాగా ఈ దేశపు కరెన్సీ ని  ఆఫ్ఘాన్ అని పిలుస్తారు.

అయితే ఈ దేశం కొంతమేర పర్వత ప్రాంతంలో ఉండటంతో అప్పుడప్పుడు భూకంపాలకు కూడా గురవుతూ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube