సమానత్వం కోరి శబరిమలలో శబరిమలలో ఆడవారి ప్రవేశంను సమర్థిస్తున్నారా... మరైతే ఈ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి  

 • శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సమానత్వం పేరుతో ఆడవారు ప్రవేశంకు సుప్రీం కోర్టు అనుమతించిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు అనుమతించిందంటూ కేరళ ప్రభుత్వం పట్టుబట్టి మరీ మహిళలను గుడిలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. పలు సార్లు చేసిన ప్రయత్నం విఫలం అవ్వడంతో, దొంగ దారిలో ఆడవారిని శబరిమల తీసుకు వెళ్లి దర్శణం చేయించిన విషయం తెల్సిందే. కేరళలో గత కొన్ని రోజులుగా శబరిమల ఇష్యూతో గొడవలు జరుగుతున్నాయి. ఈ అరాచకం ఇప్పటికైనా ఆగాలంటూ అక్కడి హిందుత్వ వాదులు కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు సమానత్వం పేరుతో ఆలయంలోకి ఆడవారు ప్రవేశిస్తే పోయేది ఏముంది అంటూ సొల్లు ప్రశ్నలు వేస్తున్నారు.

 • Sabarimala Temple And Right To Equality-Gender Equality Hindu Gods Men Women Religious

  Sabarimala Temple And Right To Equality

 • సమానత్వం పేరుతో సొల్లు ప్రశ్నలు వేసే వారికి అయ్యప్ప స్వామి భక్తులే కాకుండా, కొందరు మానవతా వాధులు మరియు హిందుత్వ వాదులు వేస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత శబరిమలలో ఆడవారిని అనుమతించడం సబబే అంటూ మరోసారి చెప్పాలి. ఆడవారిని శబరిమలలో అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్న వారు ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందే.

 • 1. ఆలయంలోకి ఆడవారిని అనుమతించకుంటే వారికి సమానత్వం లేనట్లేనంటూ ఎలా అంటారు, ఆలయంలో వారు ప్రవేశించగానే వారికి దక్కే సమానత్వం ఏంటీ. దీని కోసం ప్రశ్నించే వారు మహిళ బిల్లు కోసం ఎందుకో పోరాడటం లేదో చెప్పాలి.
  2. ఎన్నో దేవాలయాల్లో ఆడవారికి ప్రవేశం ఉంది. కొన్ని దేవాలయాల్లో కొన్ని పద్దతులు ఉంటాయి. ఆ పద్దతుల ప్రకారం కొన్ని దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు వేసుకుని వెళ్తేనే అనుమతిస్తారు. కొన్ని దేవాలయాల్లో మగవారికి అనుమతి ఉండదు. మరి ఆ దేవాలయాల్లో కూడా సమానత్వం పేరుతో సాంప్రదాయ దుస్తుల పద్దతిని తొలగించాలని, మగవారి అనుమతి కోసం ఉద్యమాలు చేస్తారా?

 • Sabarimala Temple And Right To Equality-Gender Equality Hindu Gods Men Women Religious
 • 3. ముస్లీంలు పవిత్రంగా భావించే మసీదుల్లోకి ఆడవారిని వెళ్లనివ్వరు. మరి మసీదుల్లో ఆడవారు వెళ్లకున్నా సమానత్వం ఉంటుంది. దమ్ముంటే ముస్లీం మసీదుల్లోకి ఆడవారి ఎంట్రీపై మాట్లాడగలరా?
  4. శబరిమల ఆలయంలో ప్రవేశించిన ఇద్దరు ఆడవారు భక్తితో లోనికి వెళ్లారా లేదంటే పబ్లిసిటీ కోసం లోనికి వెళ్లారో మీకు తెలియదా. ఇంత ఆందోళనలు జరుగుతాయని తెలిసి కూడా వారు ఎందుకు వెళ్లారు.

 • Sabarimala Temple And Right To Equality-Gender Equality Hindu Gods Men Women Religious
 • 5. ఆలయాల్లో ప్రవేశం కల్పించినంత మాత్రాన సమానత్వం ఎలా సాధ్యం అవుతుందో చెప్పంది.

 • ఈ ప్రశ్నల్లో దేనికి మీ వద్ద సమాధానం ఉండదు. కాని ఆలయంలోకి ఆడవారిని అనుమతించాల్సిందే అంటూ సొల్లు వాగుడు వాగేస్తారు. ఇలా మాట్లాడేవారిలో ఎక్కువ శాతం ఇతర మతాలకు చెందిన వారే ఉంటారనేది ఒక సర్వేలో వెళ్లడయ్యింది.