బాయ్ ఫ్రెండ్ తో  పార్కుకి వెళ్తే... పార్క్ లోనే దారుణంగా....

దేశంలో మహిళలపై జరిగే టువంటి అత్యాచారాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను కఠిన శిక్షలను అమలు చేస్తున్నప్పటికీ కొందరి కీచకులు వాటిని ఖాతరు చేయడం లేదు.అంతేగాక కొన్నిచోట్ల అయితే ఈ ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి.

 Women Raped By Three People In Tamilnadu-TeluguStop.com

తాజాగా టెక్స్ స్టైల్  సంస్థలో పనిచేసేటువంటి ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇ సరదాగా గడిపేందుకు పార్కు వెళ్తే పార్కులోని ముగ్గురు కీచకులు ఆమె ప్రియుడు ని పక్కకు తోసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వేలూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఓ టెక్స్ టైల్ సంస్థలో 24 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి పని చేస్తోంది.

అయితే ఈ క్రమంలో  ఈ యువతి స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది.దీంతో వారు ఏకాంతంగా మాట్లాడుకోవడం కోసం దగ్గరలో ఉన్నటువంటి ఓ పార్కుకి వెళ్లారు.

అయితే ఈ పార్క్ లో చాలా సంతోషంగా గడిపారు.అయితే మాటల విషయంలో పడి సమయం సంగతి మరిచిపోయారు.

దాంతో అప్పటికే సమయం దాదాపుగా రాత్రి తొమ్మిది గంటలు మించిపోవడంతో ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతుండగా ముగ్గురు మృగాళ్లు లాంటి వ్యక్తులు యువతి ప్రియుడు పై దారుణంగా దాడి చేసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.

Telugu Tamilnadu-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

అయితే అప్పటికే ఆమె ప్రియుడు దారుణంగా గాయపడడంతో అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.అతడు అతడు కొంతసేపటికి కోలుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి  పోలీసులకు తర్వాత జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది.బాధితురాలి తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ విచారణలో భాగంగా ముగ్గురు నిందితుల్లో ఒక నిందితుడు ఇప్పటికే పోలీసు లకు చిక్కాడు.మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube