మద్యం షాపులను బంద్ చేసిన మహిళలు.. ఎక్కడో తెలుసా?

పాపం మందుబాబులు.కరోనా వైరస్ కారణంగా ఏకంగా మూడు నెలలు మద్యం లేకుండా జీవనం సాగించారు.ఇంకా అలాంటి వాళ్ళకు ఇప్పుడు మద్యం దొరికింది.ఎవరు మాత్రం లిమిట్ లో తాగుతారు? అందరూ మితిమీరి జేబులో ఉన్న డబ్బు అంత ఖర్చు అయ్యేవరకు తాగుతారు.ఇంకా అలాంటి మందుబాబులు ఉన్న ఈ కాలంలో ఒక కాలనిలో ఏకంగా 20కిపైగా బెల్ట్ షాపులు ఉన్నాయి.

 Women Fires On Belt Shops In Adilabad , Adilabad, Women, Wine Shops Owners, Wine-TeluguStop.com

దీంతో ఎప్పుడు చూడు అక్కడ రద్దీ రద్దీ.

ఇంకా అక్కడ ఉన్న వాళ్లలో చాలామంది మద్యానికి బానిసలయ్యారు.దీంతో ప్రతి ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇవి అన్ని భరించలేని ఆ మహిళలు నిన్న ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు, ఇంకేముంది బెల్ట్ షాపులు మూసేయాలని ఆందోళనకు దిగారు.ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదివేనగర్ కాలనిలో చోటుచేసుకుంది.

బెల్ట్ షాపుల ముందు ఆందోళన చేపట్టి ఖాళీ సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు.దుకాణాలను మూసివేయాలని యజమానులను హెచ్చరించారు.ఇంకా ఆ మహిళల ఆందోళనకు కాలినీ యువకులు కూడా మద్దతు ఇచ్చారు.ఒకే కాలనిలో 20కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని.

దుకాణ యజమానులు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ అడ్డగోలుగా విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు.ఈ బెల్ట్ షాపులను వెంటనే తొలిగించాలని యజమానులు హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube