కేరళ పోలీసుల కళ్లు గప్పి జైలు గోడలు దూకి పారిపోయిన లేడీ దొంగలు  

Women Prisoners Escape From Jail In Kerala-viral In Social Media,women Prisoners Escape From Jail

జైళ్ల నుంచి ఖైదీలు గోడలు దూకి పారిపోవడం సర్వసాధారణం. వారికి అవకాశం వస్తే పారిపోతారు అన్న సంఘటనలు చాలానే విన్నాం. అయితే ఇవన్నీ కూడా పురుష ఖైదీల గురించే ఎక్కువగా వింటూ ఉంటాం..

కేరళ పోలీసుల కళ్లు గప్పి జైలు గోడలు దూకి పారిపోయిన లేడీ దొంగలు -Women Prisoners Escape From Jail In Kerala

పలానా జైలు నుంచి అంతమంది ఖైదీలు పారిపోయారు, ఇంతమంది ఖైదీలు పారిపోయారు అన్న ఘటనలు విన్నాం. అయితే వాటికి భిన్నంగా మహిళా ఖైదీలు గోడ దూకి పారిపోయిన ఘటన కేరళ లో చోటుచేసుకుంది. కేరళ పోలీసులకే షాక్ కలిగించేలా ఇద్దరు మహిళలు జైలు గోడ దూకి మరి పరారయ్యారు.

తిరువనంతపురం పరిధిలోని జైలు లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పారిపోయిన ఖైదీలను సంధ్య, శిల్పలుగా జైలు అధికారులు గుర్తించారు. పోలీసుల కళ్లు గప్పి వారిద్దరూ జైలు గోడ దూకి పారిపోయినట్లు తెలుస్తుంది. దొంగతనం కేసులో శిల్ప నేరస్తురాలు కాగా, మోసం చేసిన కేసులో సంధ్య శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే ఉన్నట్టుండి జైలు నుంచి పారిపోవడం తో వీరిద్దరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.