శుభలగ్నం మూవీ సీన్ రిపీట్ : భర్తను ఇచ్చేస్తే తన ఆస్థి మొత్తం రాసిచ్చేస్తా అంటూ…   

అప్పట్లో సీనియర్ హీరో జగపతిబాబు నటించిన ఓ చిత్రంలో అతడిని తన భార్య డబ్బు కోసం భర్తను అమ్మేసిన సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటాయి.అయితే తాజాగా అలాంటి సన్నివేశం ఓ వ్యక్తి నిజజీవితంలో జరిగిన ఘటన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం లో చోటుచేసుకుంది.

TeluguStop.com - Women Offer Her Whole Property To Purchase Another Woman Husband

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన భోపాల్ ప్రాంతంలో 45 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.ఇతడు స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నాడు.

అయితే ఇదే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్నటువంటి 55 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు.అయితే ఈ మహిళ ఇటీవల కాలంలో తన భర్త చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.

TeluguStop.com - శుభలగ్నం మూవీ సీన్ రిపీట్ : భర్తను ఇచ్చేస్తే తన ఆస్థి మొత్తం రాసిచ్చేస్తా అంటూ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనికితోడు తన కుటుంబ సభ్యులు ఎవరూ తనని ఆదరించక పోవడంతో తనతో పని చేస్తున్నటువంటి వ్యక్తితో ప్రేమలో పడింది.ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకొని తిరగడం ప్రారంభించారు.

అయితే వయసు కొంత ఎక్కువ ఉండటం, మరియు ఒకే సంస్థలో పని చేస్తుండడంతో ఎవరికీ ఇద్దరు ప్రేమికులని అనుమానం రాలేదు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా నిలిపి వేయడంతో తన ప్రియుడిని కలుసుకునే వీలు లేకపోయింది.

దీంతో ఎడబాటు భరించలేక పోయిన ఆ మహిళ వెంటనే తన ప్రియుడు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళింది.అంతేకాక తన ప్రియుడి భార్యకి తన భర్తను తనకు ఇచ్చేస్తే తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను మొత్తం రాసిచేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా తన ప్రియుడు భార్య ఖంగు తింది.

అంతేగాక వెంటనే ఈ విషయం గూర్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.విషయం తెలుసుకున్న పోలీసులు మహిళను మరియు వ్యక్తిని ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.

అయితే తర్వాత యధావిధిగా వీరిద్దరి తీరు మారక పోవడంతో చివరికి ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి.

.

#MadhyaPradesh #Married Women #WomanHusband

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Women Offer Her Whole Property To Purchase Another Woman Husband Related Telugu News,Photos/Pics,Images..