మహిళ ప్రాణం తీసిన పానీపూరీ.. ఏం జరిగిందంటే..?

మనలో ప్రతిఒక్కరూ పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు.చిన్న వయస్సు నుంచి పెద్ద వాళ్ల వరకు పానీపూరీని ఇష్టపడని వారు ఎవరూ ఉందరు.

 Women Lost Life Eating Panipurti Getting Stuck Windpipe Odissa-TeluguStop.com

దీంతో పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు పానీపూరీ బండ్లు వెలుస్తున్నాయి.తక్కువ ధరకే లభిస్తూ ఉండటం కూడా ఎక్కువ మంది పానీపూరీపై ఇష్టం చూపడానికి ఒక కారణం.

అయితే తాజాగా పానీపూరి మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది.

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారం పానీపూరీ తింటే ప్రాణాలకే ప్రమాదమని ఈ ఘటనతో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాజధాని సుందరగడ్‌ జిల్లా సరఫ్‌గడ్‌ గ్రామానికి చెందిన ఫూలమతి కిషాన్ అనే 30 సంవత్సరాల మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివశించేది.ఆమెకు పానీపూరీ అంటే ఎంతో ఇష్టం.

అయితే పానీపూరీని వేగంగా తినేయడం మహిళ ప్రాణాలు తీసింది.

పానీపూరీ శ్వాస నాళంలో ఇరుక్కుపోవడంతో ఫూలమతికి ఊపిరి ఆడలేదు.

ఆ సమయంలో మహిళ భర్త, కొడుకు ఘటనాస్థలంలోనే ఉన్నారు.ఊపిరి ఆడకపోవడంతో మహిళ వెంటనే కింద పడిపోయింది.

కొన్ని క్షణాల పాటు అక్కడ ఏం జరిగిందో మహిళ కుటుంబ సభ్యులకు, స్థానికులకు అర్థం కాలేదు.అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందింది.

మహిళ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.వైద్యులు పానీపూరీ తినే సమయంలో కంగారు పనికి రాదని తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గతంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరిగాయని చెబుతున్నారు. పానీపూరి తినే సమయంలో కొందరు కిక్ కోసం ఆదరబాదరాగా తింటారని అది గొంతుకు అడ్డం పడితే ప్రమాదమని తెలుపుతున్నారు.

గతంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నరేశ్ కుమార్ అనే వ్యక్తి పానీపూరీ గొంతుకు అడ్డం పడి ప్రాణాలు కోల్పోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube