వామ్మో... సంవత్సరం నుంచి నీళ్లు తాగకుండా జీవిస్తున్న మహిళ...

సాధారణంగా మనుషులు నీళ్లు లేకుండా ఒకరోజు లేదా రెండు రోజులు బ్రతక గలరు.కానీ ఓ మహిళ ఏకంగా నీళ్లు త్రాగకుండా దాదాపుగా సంవత్సరం కాలం పాటు జీవిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 Women Lives Without Drinking Water Since Last 1 Year-TeluguStop.com

అయితే ఆమె నీళ్లు తాగకుండా సంవత్సరకాలం పాటు జీవిస్తున్న అప్పటికీ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా జీవించడం విస్మయానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సోఫియా ఫార్తీక్ అనే మహిళ నివసిస్తోంది.

అయితే ఈమె బతుకుదెరువు కోసం యోగా శిక్షకురాలుగా ఉద్యోగం చేస్తోంది.అయితే పోయిన సంవత్సరం లో ఈమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది.

ఇందులో భాగంగా డాక్టర్లు ఆమెకు పలు సర్జరీలు కూడా చేయాలని సూచించారు.దీంతో సర్జరీలకు భయపడినటువంటి ఈమె ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించాలని వైద్యులను కోరింది.

దీంతో ఆమె స్నేహితుడు డ్రై ఫుడ్ డైట్ ని పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచించాడు.దీంతో  సోఫియా నో వాటర్ డైట్ ని పాటించింది.

ఇందులో భాగంగా  సోఫియా పూర్తిగా నీటిని తాగడం మానేసి పండ్లు మరియు ఇతర పదార్థాల ద్వారా నీటిని తీసుకుంటోంది.అయితే ఇలా ఒక నెల రోజులు పాటించగా మంచి ఫలితాలను రాబట్టింది.

దాంతో ఆమె పూర్తిగా నీటిని తాగడం మానేసి ఇతర పదార్థాల ద్వారా  నీటిని తీసుకోవడం మొదలు పెట్టింది.

Telugu Bali, Sofia Farthik-Latest News - Telugu

అయితే ఈ డైట్ పాటించిన తర్వాత తన ఆరోగ్యం చాలావరకు మెరుగుపడిందని ప్రస్తుతం తనకు ఎటువంటి సమస్యలు లేవని అంటోంది సోఫియా.అంతేగాక ఈ డైట్ తో పాటు యోగా చేయడం వల్ల తన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుందని అభిప్రాయపడుతోంది.అయినా ఏదేమైనప్పటికీ మామూలుగా మానవులు ఐదారు గంటల వరకు నీళ్లు తాగకపోతేనే అల్లాడిపోతున్నారు.

 అలాంటిది సోఫియా మాత్రం ఏకంగా సంవత్సరం నుండి నీళ్ళు తీసుకోకుండా జీవిస్తుందంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube