పోటీకి సై అంటున్న మహిళా లీడర్లు ! అవకాశం దక్కేనా ? 

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.అభ్యర్థుల ఎంపికపైనే బిఆర్ఎస్ మినహా కాంగ్రెస్ బిజెపి లు కసరత్తు మొదలుపెట్టాయి.

 Women Leaders Who Say Yes To The Competition! Will There Be A Chance, Brs, Tel-TeluguStop.com

దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా అగ్ర నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళ లీడర్లు సైతం ఆసక్తి చూపిస్తుండడంతో పాటు, టికెట్ తమకే దక్కే విధంగా ఆయా పార్టీల్లో తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు.

అయితే మహిళలకు ఏ మేరకు టికెట్ కేటాయిస్తారు అనేది మాత్రం సందేహంగానే మారింది.ఇప్పటికే బీఆర్ఎస్( BRS PARTY ) తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

ఇందులో దాదాపు సిట్టింగ్ లకే ఎక్కువ అవకాశం కల్పించారు.ఈ లిస్ట్ లో మహిళలకు పెద్దగా అవకాశం దక్కలేదు.

దీంతో కాంగ్రెస్ బీజేపీ ల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మహిళా ఆశావాహులు సిద్ధం అవుతున్నారు.కాంగ్రెస్ బిజెపిలో అభ్యర్థుల ఎంపిక చేస్తున్న నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

Telugu Aruna Tara, Brs, Congress, Telangana, Vijaya Bharati-Politics

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తితో ఉన్నారు.ఆమె వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.ఆర్మూరు లేదా బాల్కొండ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమంటూ ఆమె కాంగ్రెస్ కీలక నేతలకు ప్రతిపాదనలు పంపించారట.రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన రాధికా రెడ్డి మహిళా కోటాలో తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట.

అలాగే జిల్లాలో ముఖ్య నేతగా వెలుగొంది కొంతకాలం క్రితం మృతి చెందిన బాల్కొండ నియోజకవర్గ నాయకుడు ఆలూరు గంగారెడ్డి కుమార్తె ఆలూరు విజయభారతి( Vijaya Bharati ) టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.

Telugu Aruna Tara, Brs, Congress, Telangana, Vijaya Bharati-Politics

 ప్రస్తుతం ఆమె బిజెపిలో ఉన్నారు.ఆలూరు గంగారెడ్డి తెలుగుదేశం, బిజెపి పార్టీల్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు .ఆయన రాజకీయ వారసురాలుగా విజయభారతి బాల్కొండ నుంచి బిజెపి టికెట్ ను ఆశిస్తున్నారు .ఇక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రేమలతో అగర్వాల్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు అరుణతార( Aruna Tara ) ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలుగాను ప్రస్తుతం పని చేస్తున్నారు.

బిజెపి అభ్యర్థిగా జుక్కల్ నుంచి పోటీ చేయాలని ఆమె ఆశపడుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మహిళ లీడర్లు చాలామంది ఉన్నారు.

ఇప్పటికే టికెట్ ప్రకటన పూర్తి కావడంతో,  కాంగ్రెస్ బిజెపి నుంచి తమకు టికెట్ హామీ వస్తే ఆయా పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube