తన మూడో పెళ్లికి అడ్డొస్తుందని రెండేళ్ల చిన్నారిని చంపిన తల్లి...

ప్రస్తుతం మానవ సంబంధాలు రోజు రోజుకి మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి.తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడో పెళ్ళికి  అడ్డోస్తుందని పేగు పంచిన కన్న కూతురినే  చంపేసింది ఒకసారి తల్లి.

 Women Killed Two Years Daughter For Third 1-TeluguStop.com

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మంజుల అనే మహిళ తాడూరు గ్రామంలో తన రెండేళ్ల కూతురుతో కలిసి నివసిస్తోంది.

అయితే ఈమెకుపాండియన్ అనే వ్యక్తితో వివాహం అయింది.అయితే వీరికి కి రెండు సంవత్సరాలు కలిగినటువంటి ఒక చిన్న పాప కూడా ఉంది.

అయితే తాజాగా పాండియన్ తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తులో భాగంగా చిన్నారి తల్లి అయినటువంటి మంజుల పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.

  ఈ విచారణలో భాగంగా వారు కొన్ని విస్తూపోయే నిజాలను కనుగొన్నారు.

Telugu Thamilnadu-

గతంలో మంజుల కి మొదటగా తన మేనమామ అయినటువంటి ఓ వ్యక్తితో పెళ్లి అయిందని ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడంతో రాష్ట్రంలోని అనంతరం జిల్లాకు చెందిన పాండియన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.ఆ తర్వాత అతనితో కూడా ఆమె సరిగా మెలగలేకపోవడంతో వారి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.  దీంతో ఆమె ప్రస్తుతం ఆమె సొంత గ్రామంలో తన చిన్నారి పాపతో కలిసి వేరుగా నివాసం ఉంటుంది.

అయితే ఈ క్రమంలో రాజమణి అనే వ్యక్తి తో నూతనంగా పరిచయం ఏర్పడి అది వివాహానికి దారితీసింది. దీంతో అతడు తమ చిన్న పాపను అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నాడు.

ఈ క్రమంలో మంజులతో తమ చిన్న పాపలు చంపేయాలని లేకపోతే వివాహం చేసుకోనని చెప్పడంతో ఆమె ఆమె గత సంవత్సరం డిసెంబర్ నెలలో చిన్నారిని హత్య చేసి  కమాన్ వేట అనే కొండ ప్రాంతంలో విసిరేశారు.

పాప మృతదేహం వాసన రావడంతో అటుగా పనికి వెళుతున్న కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ దర్యాప్తులో మూడో పెళ్ళికి సిద్ధమైన తన కన్నతల్లి పాపం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube