ఏపీ రాజధాని సమీపంలో దారుణం! యువతి అత్యాచారం, హత్యా!  

ఏపీ రాజధాని సమీపంలో గుంటూరు జిల్లా, నపులూరు లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఓ ప్రేమ జంటపై కొంత మంది దుండగులు దాడి చేసి, ప్రియుడుని దారుణంగా కొట్టి, ప్రియురాలి అత్యాచారం చేసి, హత్య చేసారు. ఇప్పుడు ఈ ఘటన రాజధాని ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అయితే ప్రస్తుతం ప్రియుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వుండగా, అతని పరిస్థితి విషమంగా వుందని తెలుస్తుంది.

ఇక ప్రేమికులు ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారని, పక్క పక్కనే నివాసం ఉంటారని సమాచారం, దీంతో వారిపై దాడి చేసింది సన్నిహితులా లేకా, వేరే ఎవరైనా వున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అత్యాచార, హత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నా నేపధ్యంలో తాజాగా రాజధాని సమీపంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.