ఎయిడ్స్ ఉందని చెప్పి అత్యాచారం నుంచి తప్పించుకుంది  

ఎయిడ్స్ ఉందని చెప్పి అత్యాచారం నుంచి తప్పించుకున్న మహిళ. .

Women Escaping From Rape Attempt-rape Attempt,women Escaping

సమాజంలో ఆడవారి మీద అత్యాచారాలు చేసే మ్రుగాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఒంటరిగా మహిళా కనిపిస్తే కనికరం లేకుండా దాడి చేసి అత్యాచారం చేసి ఆపై హత్యా చేయాడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ మధ్య తరుచుగా అలాంటి ఘటనలని చ్జూస్తూనే ఉన్నాం తాజాగా మరో సారి అలాంటి ఘటన ఓ మహిళకి ఎదురైంది..

ఎయిడ్స్ ఉందని చెప్పి అత్యాచారం నుంచి తప్పించుకుంది-Women Escaping From Rape Attempt

అయితే ఆమె ఆ క్షణంలో చెప్పిన మాట వలన అత్యాచారం నుంచి బయటపడింది.

22 ఏళ్ల విలాస్ అహ్వద్ ఔరంగాబాద్ వస్తున్న సమయంలో 29 ఏళ్ల ఓ వితంతు మహిళ, తన కూతురు లిఫ్ట్ అడిగారు. మహిళ అడగ్గానే బండి ఆపి, బైక్ ఎక్కించుకున్న విలాస్ అహ్మద్ కొద్దిదూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆపి, ఆమెపై అత్యాచారయత్నంకి ప్రయత్నం చేసాడు. అయితే బైక్ ఆగినప్పుడే జరగబోయేది గ్రహించిన ఆ మహిళ, తనకేమీ అభ్యంతరం లేదని, కాకపోతే తనకు ఎయిడ్స్ ఉంద’ని చెప్పింది.

ఆ సమాధానంతో షాక్‌కు గురైన విలాస్ వారిద్దరినీ అక్కడే వదిలేసి పారిపోయాడు. తరువాత ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విలాస్ ని అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఈ సంఘటన ఔరంగాబాద్ లో సంచలనంగా మారింది.