నాలుగేళ్ల క్రితం పెళ్లి.. ఊరి చెరువులో భార్య శవం.. అసలేమైందంటే?  

women died because of dowry demand women died, dowry demand, marriage, Srivani, Pedhakakani - Telugu Dowry Demand, Marriage, Pedhakakani, Srivani, Women Died

కాలం మారుతుంది కానీ మనుషులు మాత్రం మారడం లేదు.నోటి వరకు మాత్రమే వరకట్నం వద్దు అది ఇది అని అంటున్నారు.

 Women Dowry Demand Marriage Srivani Pedhakakani

నిజ జీవితంలోకి వస్తే ఇంకా వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఇంకా ఇప్పడు కూడా తాడికొండ మండలం ముక్కామలలో శుక్రవారం ఓ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన అలా శ్రీవాణికి తాడికొండ మండలం ముక్కామల గ్రామానికి చెందిన దానబోయిన వెంకటకృష్ణతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.

నాలుగేళ్ల క్రితం పెళ్లి.. ఊరి చెరువులో భార్య శవం.. అసలేమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లి జరిగిన సమయంలో కట్నంగా మూడు సెంట్ల స్థలం, ఒకటిన్నర ఎకరం పొలం, కొంత బంగారం ఇచ్చారు.

అయితే ఏమైందో తెలియదు గత మూడు నెలలుగా శ్రీవాణి భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు.

అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీవాణి ఇంటి నుండి వెళ్లిపోయింది.దీంతో ఆమె కోసం గ్రామంలో గాలించగా ఊరి చెరువులో మృతదేహం కనిపించింది.

కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు.

#Srivani #Pedhakakani #Dowry Demand #Marriage #Women Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Women Dowry Demand Marriage Srivani Pedhakakani Related Telugu News,Photos/Pics,Images..