ఆ మహిళా క్రికెటర్స్ ఇద్దరు ఒకటయ్యారు  

పెళ్లి చేసుకొని ఒకటైన మహిళా క్రికెటర్స్. .

Women Cricketers Love Marriage In New Zealand-new Zealand,women Cricketers Love Marriage

వివాహ బంధం అంటే ఎక్కడైనా స్త్రీ, పురుషుల మధ్య ఉంటుంది. కాని ఈ మధ్య కాలంలో సమాజంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కుల సంఖ్యతో చాలా దేశాలు ఒకే జెండర్ రిలేషన్ ని కూడా సమర్ధిస్తున్నాయి. స్వలింగ సంపర్కులు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని చట్టబద్ధం చేసాయి..

ఆ మహిళా క్రికెటర్స్ ఇద్దరు ఒకటయ్యారు-Women Cricketers Love Marriage In New Zealand

ఇక ఇండియా కూడా అదే దారిలో వెళ్లి సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది. దీంతో ఇంత కాలం రహస్య జీవితాలకి పరిమితం అయిన స్వలింగ సంపర్కులు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు మహిళా క్రికెటర్ లు పెళ్లితో ఒకటైన సంఘటన న్యూజిలాండ్ లో జరిగింది.

న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ హలే జెన్సెన్‌, ఆస్ట్రేలియాకు చెందిన నికోలా హాన్‌కాక్‌ను పెళ్లాడారు. వారం రోజుల క్రితం ఈ క్రికెట్‌ జంట వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. తాజాగా వారి వివాహానికి సంబంధించిన ఫొటోలకి కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు తాజాగా పెళ్లితో ఒకటి కావడం విశేషం. ఇలా మహిళా క్రికెట్రర్లు పెళ్లి చేసుకోవడం చరిత్రలో మొదటి సారి అని చెప్పాలి.