ఐశ్వర్య ను అవమానిస్తూ ట్వీట్ చేసిన వివేక్... మహిళా కమీషన్ నోటీసులు  

Women Commission Notice On Vivek Oberoi For Comments On Aishwarya Rai-telugu Viral News,viral In Social Media,vivek Oberoi,women Commission Notice On Vivek Oberoi

సాధారణంగా సెలబ్రిటీ లపై సెటైర్స్ వేస్తూ,కామెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు నెటిజన్లు. ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీ లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతుండడం సహజం. కానీ ఒక బాలీవుడ్ హీరో తన తోటి హీరోయిన్ ను అవమానించేలా ట్వీట్ చేసి అందరి నోళ్ళల్లో నాకుతున్నాడు..

ఐశ్వర్య ను అవమానిస్తూ ట్వీట్ చేసిన వివేక్... మహిళా కమీషన్ నోటీసులు -Women Commission Notice On Vivek Oberoi For Comments On Aishwarya Rai

ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ బ్యూటీ,ఒకప్పటి మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ని అవమానిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పద మైంది.

నటిగా తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఐశ్వర్య…సల్మాన్,వివేక్ లమధ్య కొంత అఫైర్ సాగిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటికీ ముగింపు పలికి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడి ఒక పాప కు తల్లి కూడా అయ్యింది.

అయితే అంతా సజావుగా జరుగుతున్న ఈ సమయంలో ఈ విధంగా ఐశ్వర్య పై ఇలాంటి పోస్ట్ చేయడం తో అంతా వివాదాస్పదంగా మారింది. ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా ‘క్రియేటివ్! నో రాజకీయాలు..

కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టాడు కూడా.

దీనితో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ట్వీట్ పై మండిపడ్డారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలంటూ సూచిస్తూ తెలుగు బాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా, సోనమ్ కపూర్ లు కూడా ఈ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ మధుర్ బండార్కర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. ఎంతో గౌరవ పదంగా ఉండే నీ నుంచి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు వివేక్ అంటూ క్షమాపణలు చెప్పాలి అని కోరారు. వివేక్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ అతడికి నోటీసులు జారీ చేసింది..

అయితే ఈ నోటీసుల పై స్పందించిన వివేక్ నాకు ఇంకా నోటీసులు అందలేదు నోటీసులు అందాక వారికి వివరణ ఇస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు.