ఇదెక్కడి మోసం మావా : సెల్ ఫోన్ రిపేర్ కోసం వచ్చి ఏకంగా ఓనర్ ని లైన్ లో పెట్టిన యువతి... చివరికి.... 

ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలో తమ ప్రియుడు లేదా ప్రియురాలితో అందినంతా దోచుకుంటున్నారు.

 Women Cheat Men For 80 Lakh Rupees In Vijayawada-TeluguStop.com

కాగా తాజాగా ఓ యువతి సెల్ ఫోన్ రిపేరింగ్ కోసమని మొబైల్ షాప్ కి వచ్చి ఏకంగా సెల్ ఫోన్ షాప్ ఓనర్ ని లైన్ లో పెట్టి భారీ మొత్తంలో డబ్బులు గుంజిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో శ్రీ దివ్య అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.

 Women Cheat Men For 80 Lakh Rupees In Vijayawada-ఇదెక్కడి మోసం మావా : సెల్ ఫోన్ రిపేర్ కోసం వచ్చి ఏకంగా ఓనర్ ని లైన్ లో పెట్టిన యువతి… చివరికి…. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే ఈ యువతి ఫోన్ పాడవడంతో దగ్గరలో ఉన్నటువంటి మొబైల్ షాప్ కి రిపేరు కోసమే వెళ్ళింది.ఈ క్రమంలో మొబైల్ షాప్ ఓనర్ అయిన శివ కృష్ణతో యువతికి పరిచయం ఏర్పడింది.

దీంతో అతికొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త ప్రేమ కి దారి తీసింది.శ్రీ దివ్య ప్రేమలో పూర్తిగా మునిగి పోయిన శివకృష్ణ ఆమె చెప్పిందల్లా చేసేవాడు.

ఇదే అదునుగా చేసుకున్న శ్రీ దివ్య పన్నాగం పన్ని భారీ మొత్తం లో డబ్బు గుంజాలని ప్రయత్నాలు చేసింది.అనుకున్న విధంగానే తనకుకొంత డబ్బు అవసరం ఉందని కాబట్టి ఆ డబ్బు సర్దుబాటు చేస్తే తొందర్లోనే తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికింది.

అయితే శ్రీ దివ్య ప్రేమ లో పూర్తిగా మునిగి పోయిన శివకృష్ణ ఏమీ ఆలోచించకుండా దాదాపుగా 80 లక్షల రూపాయలు ఇచ్చాడు.ఆ తర్వాత శ్రీ దివ్య శివ కృష్ణ ఫోన్ ఎత్తడం మానేసింది.ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగితే తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని కేసు పెడతాననంటూ శివ కృష్ణని బెదిరించింది.దీంతో శివ కృష్ణ లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన డబ్బు తిరిగి ఇప్పించమని కోరుతున్నాడు.

#CellPhone #80Lakh #Vijayawada #Andhra Pradesh #WomenCheat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు