ఆన్‌లైన్‌లో మాయమాటలు చెప్పి బెగ్గింగ్‌, అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టిన నెటిజన్స్‌  

Women Begging In Dubai-

యూఏఈలో బెగ్గింగ్‌ అనేది నేరం. ఎవరైనా బెగ్గింగ్‌ చేస్తే వారికి జరిమానా విధించడంతో పాటు పెద్ద ఎత్తున జైలు శిక్షను కూడా అమలు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలతో బెగ్గింగ్‌ చేయించిన తల్లిదండ్రులను ఇటీవలే అక్కడ అరెస్ట్‌ చేసిన విషయం మనకు తెల్సిందే..

ఆన్‌లైన్‌లో మాయమాటలు చెప్పి బెగ్గింగ్‌, అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టిన నెటిజన్స్‌-Women Begging Online In Dubai

ఆన్‌ లైన్‌లో బెగ్గింగ్‌ ఈమద్య కాలంలో అక్కడ కొత్త ట్రెండ్‌ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో బెగ్గింగ్‌కు నో ఛాన్స్‌ కనుక సోషల్‌ మీడియాలో కొందరు బెగ్గింగ్‌ చేయడం జరుగుతుంది. తాజాగా ఒక మహిళ ఆన్‌ లైన్‌ ద్వారా బెగ్గింగ్‌ చేసి అడ్డంగా బుక్‌ అయ్యింది.

సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ అయిన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతా తెరిచిన ఒక లేడీ తాను సింగిల్‌ మదర్‌ని అని, తన ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఇబ్బంది పడుతున్నాను. నన్ను నా భర్త వదిలేశాడు. అప్పటి నుండి ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా సరైన ఉద్యోగం లభించడం లేదు. నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.

కాని ఇప్పటి వరకు ఎవరు కూడా నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా పిల్లల పెంపకం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ పోస్ట్‌ పెట్టి సాయం చేయమంటూ కోరింది..

ఆమె ధీన పరిస్థితిని అర్థం చేసుకున్న పలువురు నెటిజర్స్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 15 రోజుల్లో దాదాపు 50 వేల డాలర్లు ఆమెకు దక్కాయి. ఆ సమయంలోనే ఆమె పోస్ట్‌ చేసిన పిల్లలను గుర్తుపట్టిన కొందరు ఆమె మాజీ భర్తకు తెలియజేయడం జరిగింది.

ఆమె భర్త నుండి విడాకులు తీసుకున్న విషయం నిజమే కాని, ఇద్దరు పిల్లలను భర్త చూసుకుంటున్నాడు. ఆయన వద్దే పిల్లలు ఉన్నారు. జీవితం గడవడం కోసం, ఉద్యోగం చేసేందుకు బద్దకంగా ఉండటం వల్ల ఆమె ఇలా జనాలను చీటింగ్‌ చేసి డబ్బులు వసూళ్లు చేస్తుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు..

పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు నిలిపారు.