బామ్మ అవ్వాల్సిన వయసులో తల్లి అవుతున్న వృద్ధురాలు  

Women Become Mother At The Age Of 74-nelaparthi Padu,rajarao Mangayyamma,women Become Mother

బామ్మ అవ్వాల్సిన వయసులో ఒక వృద్ధురాలు తల్లి అవుతున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా లో చోటుచేసుకోబోతుంది.74 ఏళ్ల వయసు అంటే ఈ వయసులో చాలా మంది బామ్మ లు అవుతూ ఉంటారు.కానీ, తూర్పు గోదావరిజిల్లా నెలపర్తి పాడు కు చెందిన ఎర్రమట్టి రాజారావు,మంగాయమ్మ దంపతులకు పిల్లలు లేరు.

Women Become Mother At The Age Of 74-nelaparthi Padu,rajarao Mangayyamma,women Become Mother-Women Become Mother At The Age Of 74-Nelaparthi Padu Rajarao Mangayyamma

1962 లో వివాహం చేసుకున్న వీరికి ఇప్పటివరకు సంతానం లేదు.అయితే సంతానం కోసం అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన వారు చివరికి పక్కన ఇంటిలో ఉన్న ఒక 55 ఏళ్ల మహిళ కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయినట్లు తెలుసుకున్నారు.దీనితో కాస్త ఖర్చు కూడా పెట్టుకొనే పరిస్థితి ఉండడం తో ఆ పద్దతి ద్వారా సంతానాన్ని కనాలని మంగాయమ్మ ఆలోచించింది.అయితే ఆమె మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించిణ వైద్యులు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నంచి విజయవంతం అయ్యారు.

Women Become Mother At The Age Of 74-nelaparthi Padu,rajarao Mangayyamma,women Become Mother-Women Become Mother At The Age Of 74-Nelaparthi Padu Rajarao Mangayyamma

ఈ ఏడాది జనవరిలో గర్భం దాల్చిన ఆమెకి వయసు రీత్యా సాధారణ ప్రసవం కష్టం అని భావించిన వైద్యులు సిజేరియన్ ద్వారా ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కవలలను బయటకు తీయనున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగితే మాత్రం రికార్డ్ నెలకొననుంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం గతంలో భారతదేశంలో 72 సంవత్సరాల వయసులో ఒకామె పిల్లలకి జన్మనివ్వగా, అప్పట్లో అది రికార్డు అయ్యింది.అయితే ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ గనుక బిడ్డను కంటే ఆ రికార్డ్ చెరిగిపోయి మరో కొత్త రికార్డ్ నెలకొననుంది.