కొందరు ఆకతాయిలు ఉంటారు.రోడ్డుపై మహిళలు కనిపిస్తే ఆకతాయి పనులు చేస్తారు.
వాటిని వేధిస్తారు.కొన్ని ప్రాంతాల్లో అయితే కుర్రాళ్లు గుంపులుగా చేరి అటు వైపు నుండి వెళ్లే మహిళలను వేధిస్తూ ఉంటారు.
అలాంటి వారిపై మహిళలు అధికారులను ఫిర్యాదు చేసినా ఈ వేధింపులు మాత్రం ఆగవు.అయితే మహిళలే తలుచుకుంటే వారికి సరైన గుణపాఠం చెప్పవచ్చు.
సరిగ్గా అదే చేశారు ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలు.అసలు వాళ్లం ఏం చేశారంటే.
అది ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతం. రోడ్డుపై వెళ్తున్న మహిళను కొందరు కుర్రాళ్లు వేధించారు.కానీ ఆ మహిళ అందరు బాధితుల్లా సైలెంట్ గా ఉండిపోలేదు.వారికి ఎలా బుద్ధి చెప్పాలో.
సరిగ్గా అలాగే వారికి గుణపాఠం చెప్పారు.రోడ్డుపై వేధింపులకు గురి చేసిన యువకుడికి అదే రోడ్డుపై గుణపాఠం చెప్పారు.
చెప్పులతో చితక్కొట్టారు.ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.
అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ మహిళ యువకుడిని చెప్పుతో తీవ్రంగా కొట్టింది.
పరుగెత్తించుకుంటూ దుమ్ము దులిపింది.మరి కొందరు యువకులు ఆ యువకుడిని ఆమె నుండి కాపాడేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ లోని ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.అనంతరం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.