డబ్బులు పంచలేదని మహిళలు ఆందోళనలు..!!

తెలంగాణ రాష్ట్రంలో రేపు పోలింగ్.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్( Election Commission ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.

 Women Are Concerned That Elections Money Is Not Distributed In Miryalaguda Detai-TeluguStop.com

మొత్తం 119 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది.ఎక్కడా కూడా డబ్బులు పంపిణీ( Money ) చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ముందుగానే కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడలో( Miryalaguda ) కొంతమంది మహిళలు.డబ్బులు ఇవ్వటం లేదని ఆందోళనలకు దిగారు.

మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) చెందిన వాళ్లు డబ్బులు పంచటం లేదంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు చేయడం జరిగింది.అందరికీ ఇచ్చి మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటూ.

మహిళలు ప్రశ్నిస్తున్నారు.మేమేమి తప్పు చేసాం.? ఏం పాపం చేసాం.? గట్టిగా అడిగితే మంచోళ్ళు కాదు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి( Congress ) చెందిన వాళ్ళం అంటున్నారు.మేము ఓటు వేయనిదే రెండు సార్లు మీరు గెలిచారా అంటూ మహిళలు.ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరు అధికారం సొంతం చేసుకుంటారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్.

అధికారం కైవసం చేసుకుంది.ఈ క్రమంలో మూడోసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

కాగా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లను గెలుచుకోవాలి.ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube