సూపర్: అచ్చం లతా మంగేష్కర్ లానే పాడిందే!

టాలెంట్ ఎవరి వద్ద ఉంటుందో ఎవరికీ తెలీదు.ఈ టాలెంట్ కు అందం,వయసు తో సంబంధము ఉండదు.

 Womans Melodious Rendition Of Lata Mangeshkar Song-TeluguStop.com

ఆలా అవకాశం వచ్చినప్పుడు వారేంటో నిరూపించుకుంటూ ఉంటారు.సరిగ్గా బెంగాల్ లోని రాణా ఘాట్ రైల్వేస్టేషన్ లో ఒక మహిళకు అలాంటి అవకాశం వచ్చింది.

అంతే ఇక తనలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసి ఆమె పాటపాడింది.ఆమె పాట పాడితే ఇంత సెన్సేషన్ ఏముంది.

ఆమె నిజంగా గ్రేట్ సింగర్, గాన కోకిలగా పిలవబడే లతా మంగేష్కర్ వాయిస్ నే ఇమిటేడ్ చేస్తూ పాడడం విశేషం.దీనితో ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో ఆమె ఒక్క రోజులోనే స్టార్ అయిపొయింది.

చూడడానికి సాదాసీదా గా కనిపించినా ఆమె గాత్రానికి మాత్రం అందరూ ఫిదా అయిపోతున్నారు.దీనిని బట్టి టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు ఎవరికీ అవకాశం వస్తే వారి టాలెంట్ బయటకు వస్తుంది అన్న విషయం అర్ధం అవుతుంది.

మొత్తానికి ఆమె పాట పడుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేశారు.

సూపర్: అచ్చం లతా మంగేష్కర్ లాన

ఇక ఇప్పుడు ఈ వీడియో కి 20 లక్షల మందికి పైగా వ్యూస్ లభించడమే కాకుండా 35 వేల మందికి పైగా ఈ వీడియో ను షేర్ చేయడం గమనార్హం.మొత్తానికి లతా మంగేష్కర్ లా పాడి అందర్నీ ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ అయిపొయింది.నిజంగా ఆమెకు వయసులో ఉన్నప్పుడే అవకాశం వచ్చి ఉండిఉంటే ఖచ్చితంగా లతా మంగేష్కర్ లాగా పెద్ద పాపులర్ అయ్యివుండేదేమో మరి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube