Mexican woman : లవర్ కోసం 5,000 కి.మీ. ప్రయాణం.. చివరికి అవయవాలు అమ్ముకునే వాడి చేతిలో బలి!

ఆన్‌లైన్ డేటింగ్ సైట్ ద్వారా మొదలైన ప్రేమ చివరికి ఘోర విషాదంతమైంది.ఇటీవల 51 ఏళ్ల మెక్సికన్ మహిళ బ్లాంకా ఒలివియా తన లవర్ జువాన్‌ను కలవడానికి దాదాపు 5,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

 Woman Who Flew Nearly 5,000 Kilometres To Meet Man She Met Online, Killed For He-TeluguStop.com

అయితే ఆమె తన లవర్ ఒక అవయవాలను అమ్ముకునే కిరాతక మనిషి అని తెలుసుకోలేక పోయింది.అతడు ఆమెను చంపేసి అవయవాలను అమ్ముకున్నాడు.

ఈ విషయం మృతురాలు బ్లాంకా బంధువులు ఆరా తీయడంతో తెలిసింది.మెక్సికో నుంచి పేరులోని తన లవర్‌ను బ్లాంకా కలుసుకుంది.

అయితే, ఆమె విసుగు చెంది మెక్సికో వెళ్లిపోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.కానీ నిజానికి ఆ వ్యక్తి ఆమెను చంపేసి అవయవాలను దోచేసి బాడీని ఒక బీచ్‌లో విసిరేసి ఏమి ఎరగనట్టు ఉన్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.

37 ఏళ్ల జువాన్‌ ఒక మెడికల్ స్టూడెంట్.అతడు ఇంటర్నెట్ ద్వారా 51 ఏళ్ల మహిళను తన వలలో వేసుకున్నాడు.

ఆ తర్వాత ఆమె తన అపార్ట్‌మెంట్‌కి వచ్చాక కత్తితో నరికి అవయవాలు వేరే చోటికి సరఫరా చేసినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం.అతడి అపార్ట్‌మెంట్‌లో రక్తపు బొట్లు ఉన్నట్లు కూడా పోలీసులు కనిపెట్టారు.

అలాగే ఈ మెడికల్ స్టూడెంట్ రీసెంట్ టైమ్‌లో టిక్ టాక్ లో ఒక బ్రెయిన్ ఎలా వేరు చేయాలి, ఇంకా మనిషిలోని అవయవాలను ఎలా వేరు చేయాలి అనే వీడియోలను పోస్ట్ చేశాడట.

Telugu Blanca Arellano, Huacho Beach, Medical, Mexican, Organs, Peru-Latest News

బ్లాంకా మృతదేహం నవంబర్ 9న హువాచో బీచ్‌లో నీటిలో తేలుతున్నట్లు స్థానిక మత్స్యకారుడు గుర్తించాడు.ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ మేనకోడలు ట్విట్టర్‌లో ఈ చేదు వార్తను పంచుకొని ఆవేదన వ్యక్తం చేశారు.మృతురాలి ఆత్మకు న్యాయం చేయాలని ఆమె వాపోయారు.

అనేక మంది నెటిజన్లు కర్లాకు సంఘీభావం తెలిపారు.ట్విట్టర్‌లో #JusticiaParaBlanca ట్యాగ్ ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు.

పోలీసులు లవర్‌ని అరెస్టు చేసి ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube