వందరోజుల పాటు ఒకే డ్రెస్ వేసుకున్న మహిళ

ఏ దేశంలో అయినా ఆడవాళ్ళ వార్డ్ రోబ్ లో ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి అని చెక్ చేస్తే లెక్కపెట్టడానికి ఆయాసం వస్తుందేమో కానీ వాళ్ళ బట్టలు మాత్రం తరగవు.మార్కెట్ లోకి కొత్తరకం డిజైన్ ఏది వచ్చిన వెంటనే అది వారి ఒంటిమీదకి వచ్చేయాలని ఆడవాళ్లు కోరుకుంటారు.

 Woman Wears Same Black Dress For 100 Days, Indian Women, Wordrobe, Costumes,amer-TeluguStop.com

ఇండియాలో అయితే ఆడవాళ్ళ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్సులు నుంచి పార్టీవేర్స్ వరకు, చుడీదార్ ల నుంచి శారీల వరకు ఎన్ని ఉంటాయో చెప్పలేం.

ఒకరోజు వేసిన డ్రెస్ మరో రోజు వేయకుండా డ్రెస్సులు మారుస్తూ ఉంటారు.అలాంటిది వంద రోజుల పాటు ఒకే డ్రెస్సుతో ఆడవాళ్ళని ఉండమంటే ఎవరైనా ఉంటారా అంటే అసలు అలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.

వారికి అది సాధ్యం కానీ పని అని చాలా మంది అంటారు.అయితే ఒక మహిళ మాత్రం వంద రోజుల పాటు ఒకే డ్రెస్సు వేసుకునే ఛాలెంజ్ స్వీకరించి చేసి చూపించింది.

ఆ ఒక్క డ్రెస్ తోనే ఆమె ఆఫీస్ కి వెళ్ళింది.షాపింగ్ కి వెళ్ళింది.

బయట తిరగడానికి కూడా వెళ్ళింది.ఇది అమెరికాలో జరిగింది.

అమెరికాకు చెందిన బోస్టన్ లో 52 సంవత్సరాల సారా రాబిన్స్ అనే మహిళ గతేడాది సెప్టెంబర్ నుంచి నిన్నటి వరకు బ్లాక్ మెరినో ఊల్ డ్రెస్ ను వేసుకుంది.ఫ్యాషన్ లకు దూరంగా ఉంటూ, సాధారణ జీవితం గడుపుతూ ఆమె ఇలా వందరోజులు ఒకటే డ్రెస్ ను వేసుకుంది.

ఆమె ఒకే డ్రెస్ ను వంద రోజులు వేసుకునే ఛాలెంజ్ ను స్వీకరించింది.ఈ ఒక్క డ్రెస్ వేసుకుని ఆమె కేవలం ఇంట్లోనే కాదు, చర్చి కి, ఉద్యోగానికి కూడా వెళ్ళేది.

క్రిస్టమస్ కు కూడా ఆమె అదే డ్రెస్ వేసుకుని సెలెబ్రేట్ చేసుకుంది.ఈ వందరోజుల ఛాలెంజ్ ను ఆమె ఓ డాక్యుమెంటరీ తీసి సోషల్ మీడియాలో మినీ సెలబ్రిటీ అయిపొయింది.

అయితే, ఈ డ్రెస్ పై ఆమె రంగు రంగుల జాకెట్ లను మార్చుకునేది.డ్రెస్సులని పొదుపుగా వాడాలని ఆడుకునేవారి కోసం “ఉల్ అండ్” కంపెనీ రోవేనా స్వింగ్ డ్రెస్ ని రూపొందించింది.

ఈ డ్రెస్ సహాయంతో ఆమె వందరోజుల ఛాలెంజ్ ని పూర్తి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube