ఓరి దేవుడా.. కట్టుకున్న చీరకే లైట్లు పెట్టుకున్న మహిళ.. శరీరమంతా జిగేల్ జిగేల్..!

ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో రోజురోజుకి ఒక కొత్త టెక్నాలజీ వస్తూ మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.కొన్ని రకాల మిషిన్స్ మనిషి చేయలేని పనులను కూడా ఎంతో సులువుగా, ఎంతో వేగంగా పూర్తిచేయడం చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.

 Woman Wearing Sari Lights, Saree, Lights, Social Media, Viral Video, Women-TeluguStop.com

ఏదో ఒక రంగం అని మాత్రమే కాకుండా ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ సహాయం ఉపయోగించి రోజురోజుకి మానవాళి జీవితాన్ని సుఖంగా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.ఇకపోతే వస్త్రధారణ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో రకాల రంగుల కలయికతో రకరకాల బట్టలను మనందరమూ ధరిస్తున్నాము.

ఇక అసలు విషయంలోకి వెళితే.

మామూలుగా మనం విద్యుద్దీపాలతో మిరుమిట్లుగొలిపే దుస్తులను ధరించడం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము.

అయితే అది కేవలం సినిమాలో చూడటానికి మాత్రమే ఇవి బాగా కనిపిస్తాయి అదే బయట వేసుకుంటే.వేసుకున్న వారిని తెగ విచిత్రంగా చూస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఓ మహిళ తన చీర మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ధరించింది.ఆ మహిళ తన చీర మొత్తాన్ని విద్యుత్ లైట్లతో డిజైన్ చేసుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోతున్న ఆ చీరను కట్టుకొని ఉంటే అందరూ ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.

అలా ఆవిడ చీర కట్టుకున్న సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో కాస్త వైరల్ గా మారింది.ఆ వీడియోను చూసిన వారందరూ దీపావళి మొత్తం ఆమె చీరలోనే ఉంది అంటూ కామెంట్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు.

కావాలంటే మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

ప్రస్తుతకాలంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన అభిరుచి.

కాబట్టి ఎవరు ఏం చేసినా మనకు నచ్చితే ఆస్వాదిద్దాం.లేకపోతే, వారిని అలా వదిలేద్దాం.

ఏది ఏమైనా ఈ మెరిసే చీర మాత్రం చూపరులను తెగ ఆకట్టుకుంటోంది.ఒకవేళ ఈ చీర మీకు గాని నచ్చితే ఆన్లైన్ లో ఇలాంటి చీరలు కనిపిస్తే వెంటనే కొనేసి మీకు నచ్చిన వారికి ఇచ్చేసి వారి మనసును ఆకట్టుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube